Surya latest cinema mass teaser various popularity in youtube Surya | Mass | Teaser | Youtube

Surya latest cinema mass teaser various popularity in youtube

surya, Mass, surya latest cinema, surya news, surya updates, surya movies, surya latest updates, surya wall papres, surya nwe film news

Surya latest cinema mass teaser various popularity in youtube. The surya fans are very happy on Mass cinema teaser. In this teaser surya looking very handsome and diferent from past movies.

యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న సూర్య మాస్

Posted: 04/26/2015 05:43 PM IST
Surya latest cinema mass teaser various popularity in youtube

తెలుగు, తమిళంలో తిరుగులేని అభిమానుల్ని సంపాదించికున్న హీరో సూర్య. తన నటనతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తూ వారికి మరింతగా చేరువవుతున్నారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న ద్విబాషా చిత్రం ‘మాస్’ తమిళం, తెలుగులో విడుదల కానుంది . దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. గతంలో సూర్య నటించిన సినిమాల కంటే కాస్త డిఫరెంట్‌గా కనిపించడంతో దీనిపై అంచనాలు పెరిగాయి.షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మే 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సూర్య తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సూర్య ఇందులో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఒకటి హీరోగా, మరొకటి నెగిటివ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడట.

సినిమా టీజర్ లో సూర్య లుక్ అదుర్స్ అంటున్నారు అభిమానులు. తాము ఎలా అనుకుంటున్నామో తమ హీరో కూడా కొత్తగా ఉండడంతో పాటు, కొత్త లుక్ సూపర్ అని తెగ కాంప్లిమెంట్ లు ఇస్తున్నారు. అయితే మాస్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయేలా వున్నాయని యూనిట్‌సభ్యులు చెబుతున్నారు. సూర్యతో నయన ముచ్చటగా మూడోసారి రొమాన్స్ చేస్తోంది. యువన్ శంకర్‌రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ ఫిల్మ్‌లో ప్రణీత కూడా నటిస్తోంది. మొత్తానికి సినిమా టీజర్ అదరగొడుతోంది... మరి సినిమా విడుదల తర్వాత సూర్య ఎన్ని కొత్త రికార్డులు తిరగేస్తాడో చూడాలి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles