Actress Poorna Replaces Manchu Lakshmi | Pilavani Perantam Movie Updates

Horror girl poorna replaces manchu lakshmi pilavani perantam movie

Actress Poorna, Actress Poorna news, Actress Poorna updates, Actress Poorna hot photos, poorna updates, poorna gossips, poorna photo shoot, Manchu Lakshmi, Manchu Lakshmi news, Manchu Lakshmi updates, Manchu Lakshmi photo shoot, Manchu Lakshmi hot gallery, pilavani perantam movie, Dhanraj

Horror Girl Poorna Replaces Manchu Lakshmi Pilavani Perantam Movie : Finally The Movie Makers Of Pilavani Perantam Has Replaced Horror Actress Poorna In Manchu Lakshi Place.

మంచులక్ష్మీని భయపెట్టి బయటకు పంపిన హార్రర్ నటి!

Posted: 04/25/2015 11:58 AM IST
Horror girl poorna replaces manchu lakshmi pilavani perantam movie

మంచువారి కుటుంబం నుంచి వచ్చిన నటి మంచులక్ష్మీ.. ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకుల్ని భయపెట్టించిన విషయం తెలుసుగా! ఆమె నటనకు నంది అవార్డు కూడా లభించింది. ఇక అప్పటినుంచి విభిన్న కథాంశాలతో ఎన్నో సినిమాల్లో నటించింది. నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో వున్న హీరోయిన్లందరూ ఒక ఎత్తు అయితే.. మంచులక్ష్మీ మరో ఎత్తు అన్నట్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇటువంటి తారను ఓ హార్రర్ నటి భయపెట్టించిదట! దాంతో లక్ష్మీ భయపడి బయటకు వెళ్లిపోయిందని సమాచారం!

అసలు విషయం ఏమిటంటే.. ‘పిలవని పేరంటం’ అనే మూవీ గుర్తుందా? అదేనండి.. మంచులక్ష్మీ హీరోయిన్ గా, ఆమెకు జోడీగా కమెడియన్ ధన్ రాజ్ తెరకెక్కాల్సిన సినిమా! ఈ మూవీ గతేడాదిలోనే లాంఛనంగా ప్రారంభమైంది కూడా! అయితే.. మంచులక్ష్మీ, ధన్ రాజ్ మధ్య మాటలయుద్ధం జరిగిన నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఆ మూవీ దర్శకనిర్మాతలు ధన్ రాజ్ ను తొలగించారు. కానీ.. లక్ష్మీకి తగ్గ జోడీగా మరో కమెడియన్ ని వారు సెట్ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కావడంతో ఈ సినిమాలో నటించేందుకు మంచులక్ష్మీ అంతగా ఆసక్తి చూపలేదు. అటు ఇతర సినిమాలతో ఆమె బిజీ అయిన నేపథ్యంలో ఈ ‘పేరంటం’ ఫిల్మ్ మేకర్స్ ఆమె స్థానంలో నటి పూర్ణను తీసుకున్నట్లు సమాచారం!

‘అవును’, ‘అవును-2’ వంటి హార్రర్ చిత్రాల్లో నటించి భయపెట్టిన పూర్ణ.. హార్రర్ నటిగా గుర్తింపు పొందింది. ఇందులో ఈమె నటనకు ఎందరో అభిమానులు దోసోహం అయిపోయారు. ఒక్కసారిగా ఈమె పాపులారిటీ బాగా పెరిగిపోయిన నేపథ్యంలో మంచులక్ష్మీ స్థానే ఈమెను ‘పేరంటా’నికి పిలిచినట్లు సమాచారం! ఇక ఈమెకు తగ్గ జోడీగా కో-స్టార్ ను ఎంపిక చేసి, త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు పూర్ణ, వరుణ్ సందేశ్ తో కలిసి మరో మూవీ కూడా చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  Actress Poorna  Pilavani Perantam Movie  Dhanraj  

Other Articles