taapsee pannu turns producer for kanchana2 hindi remake Movie

Taapsee pannu turns producer kanchana2 hindi remake sanjay leela bhansali

taapsee pannu news, taapsee pannu updates, taapsee pannu gallery, taapsee pannu hot photo shoot, taapsee pannu hot photos, taapsee pannu stills, taapsee pannu images, taapsee pannu kanchana2, kanchana2 news, kanchana2 updates, sanjay leela bhansali

taapsee pannu turns producer kanchana2 hindi remake sanjay leela bhansali : Punjabi actress taapsee pannu has taken a daring decision. She may turns as producer for kanchana2 hindi remake movie with sanjay leela bhansali.

డేరింగ్ స్టెప్ వేస్తున్న తాప్సీ.. బోర్లపడితే ఖతమే!

Posted: 04/24/2015 03:10 PM IST
Taapsee pannu turns producer kanchana2 hindi remake sanjay leela bhansali

ఇటీవలే కాలంలో పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలో తమనుతాము నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేయడంతోపాటు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ గా పేరుపొందాలని కొందరు గ్లామర్ ఒలకపోయడంతోపాటు స్టంట్స్, యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ చాలా కష్టపడుతున్నారు. మరికొందరు కేవలం కెరీర్ పరంగా హీరోయిన్ గానే కాకుండా వ్యక్తిగత జీవితంలో స్థిరపడేందుకు బిజినెస్, నిర్మాణ రంగాల్లో అడుగిడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ భామలైన జూహీ చావ్లా, అనుష్క శర్మ, ప్రియాంక చోప్పా తదితరలు నిర్మాతలుగా మారి.. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఇప్పుడీ జాబితాలో చేరేందుకు తాజాగా తాప్సీ కూడా సిద్ధపడుతోంది.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు పొందిన తాప్సీకి ఇటీవలే సినిమా అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేని ఈ అమ్మడ చేతిలో తమిళ, హిందీల్లో ఒకటి అరా సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు నిర్మాణరంగంలో అడుగుపెట్టాలని భావించి.. ఓ డేరింగ్ స్టెప్ తీసుకుంది. అదేమిటంటే.. తాజాగా తాప్సీ తమిళంలో ‘కాంచన-2’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే! ఆ సినిమా తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత ఈ మూవీ హక్కుల్ని కొనుగోలు చేసినట్లు సమాచారం!

అయితే.. తాప్సీ కూడా ఈ సినిమాను సంజయ్ తో కలిసి నిర్మించేందుకు సమాయత్తమవుతోంది! ఈ మేరకు అమ్మడు సంజయ్ తో మంతనాలు జరుపగా.. అందుకు అతడు ఓకే అన్నాడని, ఇద్దరూ కలిసి హిందీలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిసింది. ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది కాబట్టి.. హిందీలోనూ సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఈమె ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ చిత్రం ఈమెకి హిందీలో లాభాలు తెచ్చిపెడుతుందా..? లేదా..? అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లపాటు ఆగాల్సిందే! హిట్ అయితే మంచిదేగానీ ఫట్ మంటే మాత్రం అంతే సంగతులు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : taapsee pannu  sanjay leela bhansali  kanchana2  

Other Articles