Kriti Karbanda speaks about sister character in Cherry Movie

Kriti karbanda special interview sister character ram charan srinu vailta movie

Kriti Karbanda news, Kriti Karbanda updates, Kriti Karbanda gossips, Kriti Karbanda gallery, Kriti Karbanda photo shoot, Kriti Karbanda hot photos, Kriti Karbanda stills, Kriti Karbanda sister character, Kriti Karbanda updates, ram charan movie, ram charan updates, srinu vaitla movies

Kriti Karbanda Special Interview Sister Character Ram Charan Srinu Vailta Movie : Kriti Karbanda Says that nothing will happen if she act as sister to cherry in his latest flick which is to be directed by Srinu Vaitla.

అలాంటి పాత్రల్లో నటిస్తే.. పోయేదేమీ లేదు!

Posted: 04/21/2015 06:31 PM IST
Kriti karbanda special interview sister character ram charan srinu vailta movie

చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే హీరోయిన్లకు అందం ఒక్కటే వుంటే సరిపోదు... దాంతోపాటు దర్శకుడు ఇచ్చే రకరకాల పాత్రల్లో నటించగలిగే ప్రతిభ వుండాలి. ఏదైనా పాత్రలో పూర్తిగా లీనమై, దానికి జీవం పోస్తేనే ఇతర సినిమాల్లో నటించే అవకాశాలు వరిస్తాయి. అలాకాకుండా తమకిష్టమైన పాత్రల్లోనే నటిస్తామంటూ డిమాండ్ చేస్తే మాత్రం కెరీర్ ముగిసినట్లే! ఈ విషయాన్ని నటి కృతి కర్బందా బాగానే పసిగట్టినట్లుంది.. అందుకే డైరెక్టర్ ఇచ్చే ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్ధమంటూ ఈ అమ్మడు ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి ఓ అరుదైన సినిమాలో బంపరాఫర్ దక్కింది.

వివరాల్లోకి వెళ్తే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ సినిమాలోనే కృతికి ఓ అరుదైన ఆఫర్ లభించింది. అయితే.. ఈ అమ్మడు చెర్రీ సరసన హీరోయిన్ గా నటించడం లేదు.. అతనికి సిస్టర్ పాత్రలో ఈ అమ్మడు నటిస్తోంది. తెలుగు, కన్నడ సినిమాల్లో పలువురు హీరోల పక్కన కథానాయికగా నటించిన ఈ అమ్మడికి గతకొన్నాళ్ల నుంచి ఆఫర్లు దక్కడం లేదు. పైగా నటించిన సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో ఈ అమ్మడి కెరీర్ గాడిలో పడింది. దీంతో ఈ భామ ఇండస్ట్రీలో తన కెరీర్ ని మలుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈమెకు చెర్రీకి సిస్టర్ గా నటించే పాత్ర లభించింది. రాకరాక వచ్చిన ఈ ఆఫర్ ని వదులుకోకూడదనే భావనతో అమ్మడు ‘సిస్టర్’ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అయితే.. ‘ఇదేంటి..? కృతి లాంటి యంగ్ హీరోయిన్ చెర్రీ పక్కన సిస్టర్ క్యారెక్టర్ చేయడం ఏంటి?’ అంటూ కామెంట్లు రావడం మొదలయ్యాయి. ఇదే ప్రశ్న కృతిని అడడగా.. అందుకు ఆమె ఈ విధంగా బదులిచ్చింది.. ‘చెర్రీ చిత్రంలో నేను నటించబోయే సిస్టర్ పాత్రను తీర్చదిద్దిన విధానం నాకు ఎంతో బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ స్కెచ్ నన్న ఆకట్టుకుంది. అందుకే, నేను వెంటనే ఒప్పుకున్నాను. నా చుట్టూ వున్నవాళ్లు కూడా ఈ విషయంలో నన్ను అభ్యంతరం పెట్టారు. అయితే.. చెర్రీకి సిస్టర్ గా నటించినంత మాత్రాన పోయేదేమీ లేదు కదా’ అంటూ తేలిగ్గా తీసుకుంది. నటి అన్న తర్వాత అన్ని పాత్రల్లో ఒదిగిపోవాలన్న భావనను ఈమె వ్యక్తపరిచింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kriti Karbanda  Ram charan  Srinu Vaitla  Telugu Movies  

Other Articles