Junior Ntr Sukumar Latest Movie News | Maa Nannaki Prematho Updates | Rakul Preet Singh

Junior ntr sukumar movie title nannaki prematho change

Junior Ntr news, Junior Ntr movies, Junior Ntr latest Movies, Junior Ntr latest Updates, Junior Ntr photos, Junior Ntr gallery, Junior Ntr Sukumar Movie, Sukumar Movies, rakul preet singh, rakul preet singh hot photoshoot, maa nannaki prematho movie

Junior Ntr Sukumar Movie Title Nannaki Prematho Change : According to the Flops rate The title of junior ntr and sukumar latest flick changes as Maa Nannaki Prematho. In this Movie Rakul Preet Singh Acting as heroine.

పరజయాల దెబ్బకు టైటిల్ లో మార్పు చేశారట!

Posted: 04/21/2015 04:16 PM IST
Junior ntr sukumar movie title nannaki prematho change

గతకొన్నాళ్ల క్రితం వరుస పరజయాలతో సతమతమైన జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే ‘టెంపర్’ సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే! ఇలా చాలారోజుల తర్వాత ఇతనికి విజయం వరించిన నేపథ్యంలో తన తదుపరి చిత్రాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కథ, నటీనటులు, ఇతరత్ర వ్యవహారాలతోపాటు చివరికి టైటిల్ విషయంలోనూ చాలా జాగ్రత్త వహిస్తున్నాడని తాజా సమాచారం!

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం విదితమే! ఈ సినిమాకు ‘నాన్నకి ప్రేమతో’ అనే టైటిల్ పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. గతంలో ఎన్టీఆర్ కు వున్న పరాజయం సెంటిమెంట్ నేపథ్యంలో ఈ మూవీ టైటిల్ లో కాస్త మార్పు చేసినట్లు ఇండస్ట్రీవర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ టైటిల్ కి ముందు ‘మా’ అన్న పదం చేర్చి.. ‘మా నాన్నకి ప్రేమతో’ అనేది టైటిల్ గా వుంటుందని అంటున్నారు. అయితే.. ఇలా మార్చడానికి ఓ బలమైన కారణం కూడా వుందిలెండి!

గతంలో ఎన్టీఆర్ విజయాలను దూరం చేసిన చిత్రాలలో ‘నా’ అన్న అక్షరంతో మొదలైన టైటిల్స్ చాలా వున్నాయి. ఇప్పుడు తాజాగా నటించబోయే చిత్రంలోనే ‘నాన్నకు ప్రేమతో’తో మొదటి అక్షరం ‘నా’ వుంది. దీంతో ఈ సినిమా కూడా ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని, గత పరాజయం సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందేమోనన్న భయంతో ఈ టైటిల్ కి ముందు ‘మా’ చేర్చినట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్-సుకుమార్ మూవీల టైటిల్ ఇప్పుడు ‘మా నాన్నకి ప్రేమతో’ కానుంది.

ఇదిలావుండగా.. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ మే 1 నుంచి లండన్ లో జరగనుంది. కథ, కథనాలతోపాటు ఎన్టీఆర్ ని సుకుమార్ ఈ సినిమాలో కొత్తగా చూపించనున్నాడని యూనిట్ బృందం తెలుపుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior Ntr  Sukumar  Rakul Preet Singh  Maa Nannaki Prematho  

Other Articles