Mohan Babu Family Members Meet Narendra Modi | Manchu Manoj Marriage Invitation Card

Mohan babu family members meet narendra modi manchu manoj marriage

Mohan Babu Family, Manchu Family, Manchu manoj, Mohan Babu Family met Modi, narendra modi news, Mohan Babu Family updates, manchu vishnu, manchu lakshmi, manoj pranathi marriage

Mohan Babu Family Members Meet Narendra Modi Manchu Manoj Marriage : Mohan Babu Family Members Meets Narendra Modi and Invites him to attend Manchu manoj and pranathi wedding On may 20.

మనోజ్ కోసం మోదీని కలిసిన మంచు ఫ్యామిలీ

Posted: 04/21/2015 03:38 PM IST
Mohan babu family members meet narendra modi manchu manoj marriage

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండో కుమారుడైన మంచు మనోజ్ కి ఇటీవలే ప్రణతి రెడ్డితో నిశ్చితార్థం జరిగిన విషయం విదితమే! హిందూ సంప్రదాయం ప్రకారం వీరి నిశ్చితార్థం మార్చి 4, ఉదయం 10.30 గంటలకు జరిగింది. విష్ణు భార్యకు స్నేహితురాలైన ప్రణతి.. వారిద్దరి మధ్య వున్న స్నేహమే ఆమెను మనోజ్ తో పరిచయం చేసింది. వారిమధ్య పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిదాకా వెళ్లిన కథ విదితమే! వీరి వివాహ ముహూర్తం మే 20వ తేదీగా పెద్దలు నిర్ణయించారు.

ఈ నేపథ్యంలోనే మనోజ్, ప్రణతి వివాహానికి హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని మోహన్బాబు ఆహ్వానించారు. మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నివాసంలో మోదీని కలిసి మోహన్బాబు పెళ్లి శుభలేఖను అందజేశారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుందని... ఈ పెళ్లికి తప్పుకుండా రావాల్సిందిగా మోదీని మోహన్ బాబు కోరారు. ఆయన వెంట విష్ణు, మనోజ్, మంచులక్ష్మీ కూడా వెళ్లారు. మోదీతో వీరంతా కొద్దిసేపు ముచ్చటించిన అనంతరం.. సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మోడీని కలవడం గర్వంగా ఉందని మనోజ్, విష్ణు, మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. ఇక మోదీని కలిసిన అనంతరం మోహన్ బాబు ప్రెస్ మీట్ లో భాగంగా కొన్ని విషయాలు వెల్లడించారు.

MohanBabu-Family-Meet-Modi-2
MohanBabu-Family-Meet-Modi-3
MohanBabu-Family-Meet-Modi-4
MohanBabu-Family-Meet-Modi-5
MohanBabu-Family-Meet-Modi-6
MohanBabu-Family-Meet-Modi-7

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. మోడీని కలవడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని, చాలా ఏళ్ల క్రితమే తనకు బీజేపీ నుండి ఆహ్వానం వచ్చిందన్నారు. ఇక కాబోయే కోడలు ప్రణీత గురించి మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి ఇద్దరూ క్లాస్ మెట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులకూ, మా కుటుంబానికీ పరిచయం ఏర్పడింది. ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. ఆ తర్వాత న్యూయార్క్ లో సీపీఎ (అమెరికాలో చార్టెడ్ ఎకౌంట్ ని సిపీఎ అంటారు) చేసింది. రెండు రోజుల క్రితం ప్రణతి తల్లిదండ్రులతో వివాహ విషయం మాట్లాడాం. మీ అందరి ఆశీస్సులతో ఈ పెళ్లి జరుగుతుంది’ అని చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Babu Family  Narendra Modi  Manoj Pranathi Marriage  Manchu Lakshmi  

Other Articles