Sureshbabu | Nattikumar | Poducers | Mafia | Telugu

Producer nattikumar contraversial statements on sureshbabu

nattikumar, sureshkumar, producer, telugu cinema, contrversial statements, nattikumar updates, suresh babu news, suresh babu updates.

Producer Nattikumar contraversial statements on sureshbabu. Nattikumar said that sureshbabu is the bollywood mafia leader. Producer Nattikumar contraversial statements on sureshbabu. Nattikumar said that sureshbabu is the bollywood mafia leader.

ఆ నిర్మాత టాలీవుడ్ మాఫియా లీడర్: నట్టికుమార్

Posted: 04/19/2015 05:29 PM IST
Producer nattikumar contraversial statements on sureshbabu

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాలు ఎప్పుడూ వెన్నంటే ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరి ఆదిపత్యం చెలామణి అవుతోంది అని అందరికి తెలుసు. అయితే తాజాగా ఓ చిన్న నిర్మాత తెలుగు సినిమా బడా నిర్మాతపై ఆరోపణలు చేశారు. ఇది వివాదాలకు తావిస్తోంది. చిన్న చిత్రాల నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాఫియా లీడర్‌లా వ్యవహరిస్తూ, పరిశ్రమను తన చెప్పుచేతుల్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని నట్టికుమార్ ఆరోపించారు. ఇప్పటికే ధియేటర్లను కబ్జా చేసిన సురేష్‌ బాబు తన చేతుల్లో అగ్రహీరోలు.. హీరోయిన్లు.. డైరక్టర్లు ఉండటంతో.. నిర్మాతల మండలితో సంబంధం లేకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమను శాసించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని ఆయన ఆరోపించారు.

నిర్మాతల మండలిని 14 మంది నిర్మాతలు కబ్జా చేయాలని చూస్తున్నారని నట్టికుమార్ అన్నారు. ఆ 14 మంది ఆధ్వర్యంలోనే నిర్మాతల మండలి నడవాలని మిగతా నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇది చిన్న సినిమా నిర్మాతలకు గొడ్డలి పెట్టన్నారు. నిర్మాతల హక్కులకు భంగం కలిగిస్తున్న ఆ 14 మంది నిర్మాతలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్మాతల మండలికి 16 కోట్ల మేర నిధులు ఉన్నాయని… అయితే, వాటిలో 5కోట్లను ఈ 14మంది కాజేశారని, మిగతా డబ్బును కూడా కొట్టేయాలని చూస్తున్నారని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమను శాసిస్తున్న ఆ 14మందిపై మిగతావారు త్వరలోనే తిరగబడతారని నట్టి అన్నారు 16 కోట్లు ఉన్న నిర్మాతల మండలని తమకు అప్పగిస్తే.. ఆరు నెలల్లో 32 కోట్లు చేసి చూపిస్తామని ఆయన అన్నారు. సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆ 14 మంది నిర్మాతలు రెండు ఛానల్స్‌కే సినిమా పరిశ్రమను కట్టబెట్టాలని చూస్తున్నారనీ విమర్శించారు. ఏ ఛానల్‌కు ప్రకటన ఇవ్వాలో వారెలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఈ విషయాలపై  ఆ 14 నిర్మాతలతో తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమని నట్టికుమార్ సవాల్‌ విసిరారు. మరి నట్టి కుమార్ మాటలపై సురేష్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles