ram gopal varma Flies Abroad After 6 Years | Affair telugu movie updates

Ram gopal varma flies abroad after 6 years for affair with stars

ram gopal varma, RGV, varma updates, ram gopal varma controversy, affair telugu movie, actor sachin joshi, meera chopra news, meera chopra affair

ram gopal varma Flies Abroad After 6 Years for affair with stars : After 6 Years the Controversial Director Ram Gopal Varma Flies polland for his latest flick affair shooting in which meera and sachin joshi playing in lead role.

విదేశంలో తారలతో ‘ఎఫైర్’ నడుపుతున్న వర్మ!

Posted: 04/18/2015 04:26 PM IST
Ram gopal varma flies abroad after 6 years for affair with stars

వివాదాలకు మారుపేరుగా నిలిచిన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తనకు అనుకూలమైన పనిని నిర్వర్తించుకునేందుకు ఇప్పుడు విదేశాల్లో పాగా వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈయన తారలతో తన ‘ఎఫైర్’ నడిపించుకోవడం కోసం పోలాండ్ పయనమయ్యారని సమాచారం! అది కూడా ఆరేళ్ల తర్వాత ఇంత హఠాత్తుగా పయనం అవ్వడంతో అది సంచలనంగా మారింది. అయితే.. ఆయన వెళ్లింది తన వ్యక్తిగత అవసరాల కోసం కాదులెండి! ఓ సినిమా షూటింగ్ నిమిత్తం తన మూవీ యూనిట్ తో కలిసి పోలాండ్ కి వెళ్లాల్సి వచ్చింది.

ప్రస్తుతం వర్మ అరడజనుకుపైగా సినిమా షూటింగులతో ఫుల్ బిజీగా కాలం గడుపుతున్నారు. ఆయన తీస్తున్న మూవీల్లో ఒకటైన ‘ఎఫైర్’ మూవీ షూటింగ్ కోసం ఆయన మూవీ యూనిట్ తో ఆరేళ్ల తర్వాత విదేశానికి (పొలాండ్) వెళ్లారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సచిన్ జోషి, మీరా చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి మేజర్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయింది. రెండు మూడు పాటలతోపాటు మరికొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే షూట్ చేయాల్సి వుంది. ఆ సీన్లను కంప్లీట్ చేయడం కోసమే ఈ చిత్రం యూనిట్ పొలాండ్ కి పయనమైంది. ఈ నేపథ్యంలోనే హీరో సచిన్ తాను, వర్మ, మీరా ముగ్గురు కలిసి వున్న సెల్ఫీ ఫోటోను అప్ లోడ్ చేశాడు.

2009లో ‘అడివి’ మూవీ షూటింగ్ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ విదేశాలకు వెళ్లారు. నితిన్, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలోని ఓ అడవి ప్రాంతంలో జరిగింది. ఇక అప్పటినుంచి వర్మ ఎప్పుడూ విదేశాలకు వెళ్లలేదు. ఇప్పుడు తాజాగా ఆరేళ్ల తర్వాత ఆయన మళ్లీ ‘ఎఫైర్’ కోసం పొలాండ్ కి వెళ్లారు. అంతేబాగానే వుంది కానీ.. ఈ మూవీ విజయం సాధిస్తుందా లేకపోతే టపీమని ఎగిరిపోతుందా..? అన్నది వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  meera chopra  sachin joshi  affair telugu movie  

Other Articles