balakrishna 100 movie title | charitrakokkadu movie updates | boyapati srinu

Balakrishna 100 movie title charitrakokkadu gossips

balakrishna news, balakrishna 100 movie, balakrishna movies, lion movie updates, lion movie news, radhika apte news, trisha krishnan news, boyapati srinu news, sai korrapati news, balayya 100 movie updates, charitrakokkadu movie

balakrishna 100 movie title charitrakokkadu gossips : The news going viral in tollywood that balakrishna's 100 movie title is finalised as charitrakokkadu which will direct by boyapati srinu and sai korrapati will produce this huge project.

చరిత్రలో ఒక్కడిగా నిలిచిపోనున్న బాలయ్య?

Posted: 04/17/2015 07:47 PM IST
Balakrishna 100 movie title charitrakokkadu gossips

‘లెజెండ్’ సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించిన నందమూరి బాలయ్య.. త్వరలోనే ‘లయన్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో బాలయ్య సీబీఐ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత బాలయ్య నటించనున్న 99వ చిత్రం కూడా ఈరోస్ ఇంటర్నేషన్ సంస్థ నిర్మించనుంది. ఇక దీని తర్వాత వచ్చే 100 చిత్రంలో బాలయ్య చరిత్రలోనే ఒక్కడిగా నిలిచిపోనున్నారని వార్తలొస్తున్నాయి. అదెలా..? ఇదివరకే చాలామంది హీరోలు 100 లేదా అంతకంటే ఎక్కువ సినిమాల్లో నటించినవారున్నారు. అటువంటి బాలయ్య తన 100 మూవీతో చరిత్రలో ఒక్కడిగా ఎలా నిలవనున్నాడు..? అని అనుకుంటున్నారా! అది తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఈమధ్యకాలంలో బాలయ్య నటించిన సినిమాలన్నింటికీ ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా టైటిల్స్ వున్న విషయం తెలిసిందే! అందులో ఉదాహరణగా ‘సింహా’, ‘లెజెండ్’ వంటివి తీసుకోవచ్చు. ఎందుకంటే.. అవి బాలయ్యకు సూటవ్వడంతోపాటు పేరుకు తగ్గ భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు తాజాగా రానున్న ‘లయన్’ సినిమా కూడా ఆయన ఇమేజ్ కు, పాత్రకు తగ్గట్టుగానే వుందని.. ఇది కూడా భారీ విజయం నమోదు చేయడం ఖాయమని అంటున్నారు. అయితే.. ఆయన కెరీర్ లోనే అత్యంత మైలురాయిగా నిలవనున్న 100వ సినిమా చరిత్రలో నిలిచిపోయే విధంగా వుండాలన్న ఉద్దేశంతో.. ఆ మూవీ టైటిల్ ని అలాగే రూపుదిద్దారు దర్శకనిర్మాతలు! అంటే.. బాలయ్య 100వ చిత్రానికి ‘చరిత్రకొక్కడు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం!

అలాగే.. ఈ 100వ మూవీని బాలయ్య ‘సింహా’, ‘లెజెండ్’లాంటి భారీ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నారని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. అలాగే.. ఈ మూవీని నిర్మాత సాయి కొర్రపాటి తన వారాహి ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ 100వ సినిమాతో బాలయ్య చరిత్రలోనే ఒక్కడిగా వుండిపోయే విధంగా భారీ వ్యయంతో నిర్మించేందుకు సైతం దర్శకనిర్మాతలు రెడీగా వున్నారని అంటున్నారు. అయితే.. ఇందుకు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna 100 movie  boyapati srinivas  charitrakokkadu  

Other Articles