maa elections | Vijay chander | Rajendra prasad won| results

Actor vijay chander comments on murali mohan

Actor Vijay chander hot comments on murali mohan, Vijay chander hot comments, Rajendra prasad won, Rajendra prasad won in maa, maa elections results, maa elections news, maa elections updates, maa elections results, Vijay chander latest comments, maa elections counting, maa elections

Actor Vijay chander comments on murali mohan: Maa Elections results out now. Rajendra prasad won in maa elections.

మురళీ మోహన్ పై నిప్పులు చెరిగిన విజయ్ చందర్

Posted: 04/17/2015 12:34 PM IST
Actor vijay chander comments on murali mohan

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో నటి జయసుధపై నటుడు రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం నటుడు మురళీ మోహన్ పై నటుడు విజయ్ చందర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ ఎన్నికల్లో జయసుధ పరాజయం చెందలేదని... మురళీ మోహన్ మాత్రమే ఓటమి పాలయ్యాడని విజయ్ చందర్ వ్యాఖ్యలు చేసారు.

రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవికోసం పోటీకీ దిగిన తర్వాత... చివరి సమయంలో జయసుధను మురళీమోహన్ ఈ అధ్యక్ష బరిలోకి దింపారని విజయ్ చందర్ పరోక్ష కామెంట్లు చేసారు. తాను ఎవరు పేరు చెబితే వారే పోటీచేయాలంటూ కలలు కన్న మురళీ మోహన్ కలలన్నీ కూడా అన్ని పటాపంచలయ్యాయని విజయ్ చందర్ అన్నారు. ఇది జయసుధ ఓటమి కాదని, కేవలం మురళీ మోహన్ ఓటమి మాత్రమేనని ఆయన స్పష్టం చేసారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా సినిమా కళాకారులంతా ఒక్కటిగా వుండాలనుకుంటే.... ప్రస్తుతం ‘మా’ కార్యాలయాన్ని కూడా ఒక పార్టీ కార్యాలయంగా మార్చేసారంటూ ఆయన మండిపడ్డారు. అయితే రాజేంద్రప్రసాద్ తాను ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకొని, వాటిని నెరవేర్చాలని విజయ్ చందర్ కోరారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ ప్యానెల్ సభ్యులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.


Video Source: NTV Telugu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maa elections  Vijay chander  Rajendra prasad won  results  

Other Articles