యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సుకుమార్ మరియు దేవిలు తన బృందంతో కలిసి స్పెయిన్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కి వెళ్ళారని, ఏప్రిల్ 9వరకూ అక్కడే వుండనున్నట్లుగా తెలిసింది.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ‘దండయాత్ర’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more