Son Of Satyamurthy | Movie | Dubai

Son of satyamurthy movie release in dubai

Son Of Satyamurthy Release in Dubai, Son Of Satyamurthy Release Date, Son Of Satyamurthy movie news, Son Of Satyamurthy movie updates, Son Of Satyamurthy stills, Son Of Satyamurthy movie stills, Son Of Satyamurthy latest stills, Son Of Satyamurthy latest posters, Son Of Satyamurthy trailer, Son Of Satyamurthy songs, Son Of Satyamurthy jukebox, Son Of Satyamurthy posters, Allu arjun

Son Of Satyamurthy Movie Release in Dubai: Trivikram srinivas Latest Movie Son Of Satyamurthy. Allu arjun, Samantha, Nithya menon, Adha Sharma act in lead roles. Devisriprasad music.

దుబాయ్ లో సన్నాఫ్ సత్యమూర్తి విడుదల

Posted: 03/31/2015 05:48 PM IST
Son of satyamurthy movie release in dubai

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం దుబాయ్ లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దుబాయ్ AKS ఎంటర్ టైన్మెంట్ వారు విడుదల చేస్తున్నారు.

దుబాయ్ లోని తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్ల సంస్థలలో AKS ఎంటర్ టైన్మెంట్ గ్రూప్ ఒకటి. వీరు ఈసారి అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే మంచి ప్రజాదారణ పొందింది. ఇప్పటికే ఈ చిత్ర నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ రేటుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. సినిమా విడుదలకు ముందే 30 కోట్లకు పైన బిజినెస్ జరిగినట్లుగా సమాచారం.

బన్నీ సరసన నిత్యామీనన్, సమంత, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, నటుడు రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son Of Satyamurthy  Release in Dubai  Trailer  Songs  

Other Articles