son of satyamurthy | Censor Report | Allu Arjun

Son of satyamurthy movie censor report

son of satyamurthy censor report, son of satyamurthy censor updates, son of satyamurthy censor certificates, son of satyamurthy censor details, son of satyamurthy movie news, son of satyamurthy movie updates, son of satyamurthy movie stills, son of satyamurthy trailer, son of satyamurthy songs, son of satyamurthy

son of satyamurthy Movie censor report: Allu arjun latest movie s/o satyamurthy. Trivikram direction. samantha, nithya menon, adha sharma heroines. devisri prasad music.

UA సర్టిఫికెట్ దక్కించుకున్న సన్నాఫ్ సత్యమూర్తి

Posted: 03/30/2015 04:30 PM IST
Son of satyamurthy movie censor report

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ఏప్రిల్ 9న అత్యధిక ధియేట‌ర్లలో విడుద‌ల‌ కానుంది. ఇటీవ‌లే దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఆడియో సూప‌ర్‌హిట్ అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.

ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ఎటువంటి క‌ట్స్ లేకుండా U/A స‌ర్టిఫికేట్ రావ‌టం విశేషం. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావు రమేష్ నటించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ ల కాంబినేష‌న్ తో మా బ్యానర్లో చిత్రీకరిస్తున్న‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన అద్భుతమైన పాటలు ఇప్పటికే సూప‌ర్‌హిట్ అయ్యాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఈరోజు సెన్సార్ పూర్తిచేసుకుని చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రానికి U/A స‌ర్టిఫికేట్ ఎటువంటి క‌ట్స్ లేకుండా రావ‌టం సంతోషంగా వుంది. తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మ‌రియు ల‌క్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్, ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : son of satyamurthy  Censor Report  Release Date  Allu Arjun  

Other Articles