Shahrukh khan | Narendra Modi | Twitter Followers

Shahrukh khan beats narendra modi in twitter followers

shahrukh khan, shahrukh khan twitter, shahrukh khan news, shahrukh khan updates, shahrukh khan fan movie, fan movie updates, fan movie news, shahrukh khan fan, shahrukh khan twitter, narendra modi news, narendra modi twitter, narendra modi twitter account, shahrukh khan narendra modi, amitabh bachchan

shahrukh khan beats narendra modi in twitter followers : Bollywood Baadshah Shahrukh Khan got more followers in twitter account than narendra modi.

‘నరేంద్రమోడీ కాదు.. నేను బాద్ షా’ అంటున్న షారుఖ్

Posted: 03/30/2015 04:08 PM IST
Shahrukh khan beats narendra modi in twitter followers

నటుడు షారుఖ్ ఖాన్ ఇప్పటికే బాలీవుడ్ బాద్ షాగా కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈయన సినీపరిశ్రమలో బాద్ షాగా పేరుపొందగా.. పొలిటికల్ రంగంలో భారత ప్రధాని నరేంద్రమోడీ సింగంలా ముందుకు దూసుకుపోతున్నారు. ఇలా తమతమ రంగాల్లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న వీరిద్దరిలో షారుఖ్ ఓ విషయంలో ప్రధాని కంటే ముందంజలో వున్నాడు. ఇంతకీ ఏ విషయంలో అని అనుకుంటున్నారా..? అది తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

రాజకీయ ప్రముఖులు, సినీ తారలు తమ అభిమానులతో నేరుగా అనుసంధానం చేసుకోవడానికి వీలుగా ‘ట్విటర్’ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే! ఈ మాధ్యమాన్ని నిత్యం ఉపయోగించేవారిలో మోడీ, షారుఖ్ లు కూడా వున్నారు. వీరిద్దరిలో మోడీ ‘ట్విటర్’లో జాయిన్ అయి చాలాకాలమే అయింది కానీ.. కాలక్రమంలో ఈయన హవా కొనసాగుతుండటంతో ఇప్పుడు ఫాలోవర్స్ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మోడీకి 11.1 మిలియన్ అభిమానులు ఫాలో అవుతున్నారు.

ఇక 2010 జనవరి 2వ తేదీన ట్విటర్ లో జాయిన్ అయిన షారుఖ్.. అనతికాలంలో లక్షలాది ఫాలోవర్స్ ను వెనకేసుకున్నాడు. మొన్నటికంటే మోడీకంటే తక్కువ ఫాలోవర్స్ వున్న ఇతని ట్విటర్ అకౌంట్ కి.. గత శనివారం నుంచి 12 మిలియన్లు (కోటి 20 లక్షలు) చేరుకుందని ట్విటర్ పేర్కొంది. అంటే.. మోడీకన్నా షారుఖ్ ముందున్నాడన్నమాట! అయితే.. వీరిద్దరికంటే బిగ్ బీ 13.9 మిలియన్ల ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shahrukh khan  narendra modi  amitabh bachchan  twitter account  

Other Articles