veteran actor krishnam Raju and actress Roja on maa elections

Krishnam raju and roja on maa elections

krishnam Raju, actress Roja, maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja, actress Hema, maa president elections, maa, movie arts association, shivaji raja, hema,

eteran actor krishnam Raju and actress Roja on maa elections

ఎవరు గెలిచినా.. ‘మా’ ముందుకు నడిపించాలి..

Posted: 03/29/2015 04:17 PM IST
Krishnam raju and roja on maa elections

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలలో ఎవరు గెలిచినా తెలుగు సినీ కళామతల్లి బిడ్డల సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు నడిపించాలని సీనియర్ నటుడు కృష్ణం రాజు అకాంక్షించారు. 'మా' అసోసియేషన్ ఎన్నికలు సరదాగా, ప్రశాంత వాతావరణంలో జరుగాయన్నారు. ఈ ఎన్నికలలో ఎవరు గెలిచిన అసోసియేషన్ ను ముందుకు నడిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల ముగియడంతో ఇక అంతా ఓక కుటుంబంలా కలసిమెలసి పనిచేయాలని ఆకాంక్షించారు.

గతానికి భిన్నంగా ప్రస్తుతం జరుగుతున్న మా ఎన్నికల తీరు కాస్తంత బాధను కలిగించిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి రోజా అన్నారు. మా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లకోసారి కావడంవల్ల పెద్దలంతా ఓసారి ఓచోట కూర్చుని ఎవరికో ఒకరిని 'మా' అధ్యక్షుడిని ఎన్నుకుంటే బావుండేదని అన్నారు. ఎవరి లాభాలను ఇందులో చూపించకుండా ఉండాల్సిందని, ఎవరో పెద్దలు తమ స్వార్థంతో దీని వెనుకాల ఉండి చిచ్చు పెట్టారని అన్నారు.

అయితే, కాంపిటేషన్ ఉండటం ప్రస్తుతం మంచిదని, అలా ఉన్నప్పుడే ఎవరు ఏం చేస్తారో ముందే చెప్తారని అన్నారు. గతంలో  ఎన్నడూ లేనిది ఈసారి మ్యానిఫెస్టో వచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు చిన్నచిన్న నటులకు మా వల్ల పెద్ద సాయం జరగలేదని, వృద్ధ కళాకారులను ఇకముందైనా ఆదుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు. మాను సొంత ఇంటిలా చిన్న కళాకారులు ఫీలవలేకపోయారని ఆ లోటు లేకుండా చూడాలని చెప్పారు. భవిష్యత్ మంచిగా, హెల్దీగా ఉండేలా మా పరిస్థితి ఉండాలని ఆశించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad  jayasudha  maa elections  movie arts association  krishnam Raju  Roja  

Other Articles