Rajendra Prasad | Jayasudha | Naga Babu | Murali Mohan

Actress hema challenge to rajendra prasad panel

Actress Hema Challenge to Rajendra Prasad, Actress Hema Satires on Naga Babu, Hema Satires on Naga Babu, Jayasudha Panel Press Meet, rajendra prasad, jayasudha, megabrother nagababu, murali mohan, maa elections news, maa elections controversy, maa elections updates, rajendra prasad updates, jayasudha updates, nagababu updates

Actress Hema Challenge to Rajendra Prasad Panel: Telugu actress hema satires on mega brother nagababu in jayasudha panel press meet. there is a cold war going inside this between Nagababu and Murali mohan teams.

రాజేంద్ర ప్రసాద్, నాగబాబులకు నటి హేమ ఛాలెంజ్

Posted: 03/28/2015 11:37 AM IST
Actress hema challenge to rajendra prasad panel

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లోని అధ్యక్ష పదవికోసం రాష్ట్ర ఎన్నికల కంటే దారుణంగా ఒకరిపై ఒకరు తెగ విమర్శలు చేసుకుంటున్నారు. రేపు(మార్చి 29)న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ అధ్యక్ష పదవి కోసం జయసుధ, రాజేంద్రప్రసాద్ లు పోటీపడుతున్నారు. ఇరు ప్యానెల సభ్యులు ఒకరిపై ఒకరు మాటల తూటలు విసురుకుంటున్నారు.

అయితే ఇటీవలే జయసుధ ప్యానెల్ సభ్యులలో ఒకరైన నటి హేమ.. నటుడు నాగబాబుపై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గతంలో నాగబాబు ప్రెసిడెంట్ గా పనిచేసి, ఆ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా.. ఓ సొంత ఇల్లు కొనుక్కొని డబ్బులు మొత్తం ఖర్చుపెట్టి చక్కగా వెళ్లిపోయాడంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. హేమ కామెంట్లకు కూడా నాగబాబు పలు సెటైర్లు వేసారు.

అయితే తాజాగా జయసుధ ప్యానెల్ వారు వారి మేనిఫెస్టోను విడుదల చేసారు. ఈ సంధర్భంగా ప్రెస్ నోట్ ను ఏర్పాటు చేసారు. ఈ సంధర్భంలో హేమ మరోసారి రాజేంద్రప్రసాద్, నాగబాబులపై కామెంట్లు చేసింది. ‘మా’ సభ్యుల కోసం తాము 5కోట్ల నిధులు ఇస్తామంటూ రాజేంద్రప్రసాద్ ప్యానెల్ వారు ఛాలెంజ్ చేసారు. అదే నిజమైతే ఇప్పుడు గనుక రాజేంద్రప్రసాద్ గారు మీ అందరి ముందు వచ్చి, మా అసోసియేన్ కోసం 5 కోట్లు ట్రాన్స్ ఫర్ చేస్తే.. మేమందరం విత్ డ్రా అయిపోతాం.. ఆయనను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ ను చేసేస్తాం అంటూ మాట్లాడుతుండగానే హేమ దగ్గర నుంచి వెంటనే జయసుధ మైక్ లాగేసుకున్నారు.

హేమ ఇలా మాట్లాడుతుండగానే జయసుధ మైక్ లాగేసుకొని, జయసుధ మాట్లాడుతూ... హేమ పాపం ఏదో ఆవేశంతో మాట్లాడుతోంది తప్ప అంతా ఛాన్స్ లేదు. మేమేం ఆడవాళ్లం కాబట్టి కానీ... ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కోలేదు. ఎవరికి సహాయం చేయాలో వారికి తప్పకుండా సహాయం చేస్తాం అంటూ చెప్పుకొచ్చింది. మరి హేమ మాటలపై రాజేంద్రప్రసాద్ ప్యానెల్ వారు ఎలా స్పందించనున్నారో చూడాలి

Video Courtesy : Tolivelugu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Hema  Challenge  Rajendra Prasad  Nagababu  

Other Articles