Charan Tej | Mega Powerstar | Birthday Wishesh

Special birthday wishesh to ram charan tej

Ram Charan Happy Birthday, Ram Charan Birthday, Ram Charan Birthday stills, Ram Charan Birthday posters, Ram Charan Birthday greetings, Ram Charan Birthday news, Ram Charan Birthday gallery, Ram Charan latest news, Ram Charan movie news, Ram Charan stills, Ram Charan latest stills, Ram Charan

Special Birthday Wishesh to Ram Charan Tej: Mega Powerstar Ram Charan Tej. List of movies of Ram Charan Tej, Ram Charan Tej Latest Hits, and Songs of Chiranjeevi. Konidala Ram Charan Teja, popular as Cherry

మెగాపవర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు

Posted: 03/27/2015 10:56 AM IST
Special birthday wishesh to ram charan tej

‘ఈ అడవి నాదే... ఈ వేట నాదే’ అంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ‘చిరుత’ గా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్... మొదటి చిత్రం ‘చిరుత’తో కమర్షియల్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో చరణ్ కు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టింది.

అటు యాక్షన్, డాన్స్ లలో చరణ్ అదరగొట్టేసాడు. ఇక రెండవ చిత్రం ‘మగధీర’తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఏంటో చూపించేసాడు. ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో రాంచరణ్ ‘మెగాపవర్ స్టార్’గా మారిపోయాడు.

‘మగధీర’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలన్నింటిని బ్రేక్ చేసేసాడు చరణ్. నటుడిగా తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించాడు రాజమౌళి. ‘మగధీర’ సినిమా చరణ్ సినీ కెరీర్ లోనే ‘ది బెస్ట్ చిత్రం’గా చెప్పుకోవచ్చు. ఇందులో చరణ్ రెండు విభిన్న పాత్రలలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాతో చరణ్ పూర్తి కమర్షియల్ హీరోగా మారిపోయాడు.

కానీ అప్పటి వరకు కమర్షియల్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న చరణ్... లవర్ బాయ్ గా ‘ఆరెంజ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ సాధించకపోయినప్పటికీ అమ్మాయిల మనసుల్లో మాత్రం చెర్రీ స్థానం సంపాదించుకోగలిగాడు. ఇక అక్కడి నుంచి వరుస కమర్షియల్ మాస్ చిత్రాలతో చరణ్ దూసుకెళ్తున్నాడు.

‘ఆరెంజ్’ తర్వాత ‘రచ్చ’, ‘నాయక్’, ‘ఎవడు’ వరకు కమర్షియల్ మాస్ చిత్రాల్లో నటించాడు. ఇక కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేక్షకుల కోసం ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రంతో వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ... టాక్ పరంగా మంచి విజయం సాధించింది.

ప్రస్తుతం రాంచరణ్ ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో వున్నారు చిత్ర యూనిట్.

తక్కువ సమయంలో భారీ క్రేజ్ ను సంపాదించుకున్న మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ పుట్టినరోజు నేడు. ఈ సంధర్భంగా చెర్రీకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువిశేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ram Charan  Happy Birthday  Movie News  

Other Articles