Actor suman 100 movie hero character message oriented film

actor suman news, suman movies, suman press meet, suman photos, actor suman interview, actor suman controversies, actor suman affairs

actor suman 100 movie hero character message oriented film : Actor suman revealed that he is going to do 100 movie as hero.

హీరోగా సెంచరీ చేసేందుకు సిద్ధమైన సుమన్...

Posted: 03/06/2015 01:15 PM IST
Actor suman 100 movie hero character message oriented film

చిత్రపరిశ్రమలోకి ఆరడుగుల అందగాడిగా ఎంట్రీ ఇచ్చిన సుమన్.. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించారు. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంతోపాటు హిందీతో కలిపి 400 సినిమాలకు పైగా నటించిన ఆయన.. వాటిలో హీరోగా 99 సినిమాలు చేయగా మిగతావన్నీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. సెకండ్ ఇన్నింగ్సులో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కెరీర్ సాగించిన సుమన్.. త్వరలోనే హీరోగా నటించనున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే సుమన్ మాట్లాడుతూ.. ‘హీరోగా 99 సినిమాలు చేశాను. త్వరలోనే కథానాయకుడిగా 100వ సినిమా తెలుగులోనే చేస్తాను. నా వయస్సుకు తగ్గ కథను ఎంచుకుంటాను. వినోదంతోపాటు జాతీయభావం, యువతకు సందేశం ఉండేలా కథను వెతుకుతున్నాను. కథను బట్టి ఇతర భాషల్లో కూడా ఈ సినిమా డబ్బింగ్ చేసే అవకాశముంది’’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ మూవీకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించున్నట్లు ఆయన తెలిపారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం సుమన్ హిందీలో అక్షయకుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘గబ్బర్’ మూవీలో, అనుష్క ప్రధానపాత్రలో నటిస్తున్న ‘రుద్రమదేవి’లో నెగెటివ్ రోల్ లో నటిస్తున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీలోనూ ఒక స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు. వీటితోపాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఒక్కొక్కటి చొప్పున మూడూ సినిమాలతోపాటు రెండు కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor suman interview  telugu movie news  

Other Articles