Nayanatara jayaram water connection cut to house in ooty

narayanatara news, nayanatara hot photos, nayanatara photo shoot, nayanatara notice, nayanatara tax controversy, actor jayaram news, jayaram nayanatara flats, nayanatara flats

nayanatara jayaram water connection cut to house in ooty : the it officials of ooty sends notice to nayanatara and jayaram to pay tax as much as soon.

ఇంటిని జప్తు చేస్తామంటూ ‘శ్రీముఖాలు’!

Posted: 03/05/2015 07:25 PM IST
Nayanatara jayaram water connection cut to house in ooty

మూడుపదుల ముద్దుగుమ్మ నయనతార తెలిసిచేసిందో లేక తెలియక మిన్నకుండిపోయింది తెలియదు కానీ.. ఇప్పుడామె పెద్ద సమస్యలో చిక్కుకుంది. ఈమెను ఎన్నిసార్లు హెచ్చరించినా.. వాటికి సమాధానం ఇవ్వకపోవడం వల్ల ఈమె ఇంటిపై దాడి చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం!

వివరాల్లోకి వెళ్తే.. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని లవ్‌టెల్ రోడ్డు రాయల్ కాస్టిల్ అనే ప్రాంతంలో 122 ఇళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే నటుడు జయరాం, నటి నయనతారలకు చెందిన ఇళ్లు కూడా వున్నాయి. ఈ నటీనటులతోపాటు మరికొందరు వ్యాపారవేత్తలు చాలాకాలం నుంచి కార్పొరేషన్ కు ఇంటి పన్నును చెల్లించడం లేదు. దీంతో పన్నుకట్టని ఇళ్లకు వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లను కట్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. వారి ఇళ్లకు జప్తు నోటిసులు కూడా అంటించినట్లుగా అధికారులు వెల్లడించారు.

ఇదే విషయమై కార్పొరేషన్ కమిషనర్ శివకుమార్ మాట్లాడుతూ... ఊటీ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటి పన్ను వసూలు చేస్తున్నట్లు చెప్పారు. జయరాం, నయనతోపాటు పలు వ్యాపారవేత్తలు ఇంటి పన్ను చెల్లించకపోవడంతో తాము ఒత్తిడి తీసుకొస్తూ నోటీసులు కూడా అంటించామన్నారు. అయినా వాటిని కొందరు చింపి పారేశారే గానీ పన్ను చెల్లించలేదన్నారు. దీంతో వారి ఇళ్లకు జప్తు నోటీసు అంటించినట్లు తెలిపారు. ఇప్పటికీ వారు స్పందిచకపోతే ముందుగా వారి ఇళ్లకు వాటర్, డ్రైనేజ్ కనెక్షన్లను కట్ చేయనున్నట్లు.. ఆ తరువాత జప్తుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayantara  actor jayaram  it officials  kollywood news  

Other Articles