Junior ntr vakkantham vamshi movie updates action drama film

junior ntr news, ntr movies, junior ntr movies, vakkantham vamsi news, ntr vakkantha movie updates, ntr gossips, vakkantham vamsi news, ntr sukumar movie, temper collections, temper movie updates

junior ntr vakkantham vamshi movie updates action drama film : Junior ntr has given green signal to act in vakkantham vamsi directorial movie.

మరో యాక్షన్ డ్రామాకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..

Posted: 03/05/2015 06:24 PM IST
Junior ntr vakkantham vamshi movie updates action drama film

ఇటీవలే ‘టెంపర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇంతలోనే ఎన్టీఆర్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవలే తెలుగు సినీ రచయితలందరూ దర్శకులుగా తమ అదృష్టాన్నీ పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే! ఇప్పటికే కొందరు సినీరైటర్స్ స్టార్ హీరోలతో సినిమాలు తీసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే ప్రముఖ రచయిత వక్కంతం వంశీ పయనిస్తున్నాడు. ‘టెంపర్’ వంటి సూపర్ హిట్ కథను వంశీ ఈసారి ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ రచయిత తాను రాసుకున్న స్టోరీ లైన్ ని ఎన్టీఆర్ కు వినిపించాడట! ఆ స్టోరీ నచ్చడంతో జూనియర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట!

ఇదే విషయమై వంశీ మాట్లాడుతూ.. ‘‘అవును.. ఎన్టీఆర్ తో కలిసి ఓ మూవీ సబ్జెక్టు డిస్కస్ చేస్తున్నాం. నేను చెప్పిన స్టోరీ లైన్ పాయింట్ ఎన్టీఆర్ కి బాగా నచ్చింది. ప్రస్తుతం దీనిని డెవలప్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త తరహా క్యారెక్టర్ లో కనిపిస్తాడని వంశీ తెలిపాడు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వార్తలు త్వరలోనే వెలువడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr movies  vakkantham vamsi  director sukumar  

Other Articles