Mosagallaki mosagaadu first look released

Mosagallaki Mosagaadu‬ First Look Poster, Mosagallaki Mosagaadu‬ First Look, Sudheer Babu ‎Mosagallaki Mosagaadu‬ First Look Poster, Sudheer Babu as mosagallaku mosagadu, Sudheer Babu new movie mosagallaku mosagadu, Sudheer Babu movie mosagallaku mosagadu, Sudheer Babu's new movie under AN Bose direction, Sudheer Babu's new movie shooting starts, Sudheer Babu's new movie underway, Sudheer Babu to work with DK Bose director, Sudheer Babu's new film launched, Sudheer Babu, Latest News, Videos, Photos

‎Mosagallaki Mosagaadu‬ First Look Released: Young hero Sudheer Babu, was debut as hero with the movie 'Prema Katha Chitram'. Now, he has started shooting for yet another movie in the direction of AN. under Lakshmi Narasimha Entertainments of Swamy Ra Ra fame. Movie Title Mosagallaki Mosagaadu. Movie‬ First Look Poster Released today.

మోసగాళ్లకు మోసగాడు ఫస్ట్ లుక్

Posted: 03/05/2015 02:03 PM IST
Mosagallaki mosagaadu first look released

‘ప్రేమకథాచిత్రమ్’ సినిమాతో హీరోగా తనని తాను నిరూపించుకున్న నటుడు సుధీర్ బాబు ప్రస్తుతం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నందిత హీరోయిన్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

కన్నడంలో హిట్టయిన ‘ఛార్మినార్’ చిత్రానికి ఇది రీమేక్. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు నటిస్తున్న మరో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

‘డీకే బోస్’ సినిమా దర్శకుడు ఎఎన్ బోస్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే నిఖిల్, స్వాతి జంటగా నటించిన ‘స్వామిరారా’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే టైటిల్ ఖరారు చేసారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో సుధీర్ చాలా స్టైలిష్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం సుధీర్ నటిస్తున్న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Babu  Mosagallaki Mosagaadu  ? First Look Poster  

Other Articles