Kareena kapoor item song karan johar sidharth malhotra brothers movie

kareena kapoor, kareena kapoor item songs, kareena kapoor hot songs, kareena kapoor hot videos, kareena kapoor latest news, kareena kapoor gallery, kareena kapoor item girl, kareena kapoor prostitution, kareena kapoor news, karan johar news, akshay kumar, siddharth malhotra

kareena kapoor item song Karan Johar Sidharth Malhotra brothers movie : Only for BFF Karan Johar – Kareena Kapoor to do an item song with Sidharth Malhotra in ‘Brothers’

అతని కోసం ‘ఐటెం’గా మారిన కరీనా...

Posted: 03/04/2015 01:40 PM IST
Kareena kapoor item song karan johar sidharth malhotra brothers movie

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తో పెళ్లి చేసుకున్న తర్వాత కరీనా కపూర్ కాస్త లిమిటెడ్ గా సినిమాలు ఒప్పుకుంటోంది. గతంలోలాగా సెక్సీ పాత్రలు కాకుండా కేవలం కమర్షియల్ తరహా క్యారెక్టర్లకే ఆమె ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. పైగా.. తన సినిమాలు కూడా అంతగా ఒప్పుకోవడం లేదు. చివరిసారిగా ఈ అమ్మడు నటించిన ‘సింగం రిటర్న్స్’లోనూ చాలా సింపుల్ గా కనిపించింది. ప్రస్తుతం సల్మాన్ సరసన ‘బజరంగీ భైజాన్’ చిత్రంలో నటిస్తోంది. అందులోనూ ఈమె కమర్షియల్ క్యారెక్టర్నే పోషిస్తోంది. దీంతో.. ఆమె గ్లామర్ పాత్రలకు దూరమయ్యిందనే వార్తలు వెలువడ్డాయి. అయితే.. అవన్నీ కేవలం ఊహాగానాలేనని కరీనా మరోసారి నిరూపించింది.

తాజాగా కరీనా ఓ ఐటం సాంగ్ లో నృత్యించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాలీవుడ్ సమాచారం! అది కూడా కేవలం తనకెంతో ఇష్టమైన స్నేహితుడు కరణ్ జోహర్ కోసమే ఈమె ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. కరణ్ జోహర్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న హాలీవుడ్ చిత్రం ‘వారియర్’ రీమేక్ ‘బ్రదర్స్’లో కరీనా కపూర్ ఓ ఐటెం సాంగ్ లో చిందులేయనుంది. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తుండగా.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే కరీనా ఐటెంసాంగ్ షూటింగ్ ప్రారంభం కానుందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇదిలావుండగా.. కరీనా గతంలో ‘ఫేవికాల్ సే’ అంటూ ‘దబాంగ్ 2’లో, ‘ఛమ్మక్ ఛల్లో’ అంటూ ‘రా.వన్’ సినిమాలో ఐటెంసాంగుల్లో నృత్యించింది. ఇప్పుడు చాలారోజుల తర్వాత మరోసారి ఐటెంగా కనువిందు చేస్తూ అభిమానులను సంతోషపరచనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kareena kapoor item songs  karan johar  brothers bollywood movie  

Other Articles