Chiranjeevi suggestions sai dharam tej mr and mrs ramacharai kannada movie telugu remake

chiranjeevi news, chiranjeevi gossips, sai dharam tej news, sai dharam tej gossips, sai dharam tej kannada movie, sai dharam tej affairs, chiranjeevi politics, mr and mrs ramachari movie news, mr and mrs ramachari kannada movie

chiranjeevi suggestions sai dharam tej mr and mrs ramacharai kannada movie telugu remake : According to the tollywood sources.. chiranjeevi has given suggestions to producer rajkumar to remake kannada movie with sai dharam tej.

చిరంజీవి సలహామేరకు మేనల్లుడికి బంపరాఫర్!

Posted: 03/04/2015 01:01 PM IST
Chiranjeevi suggestions sai dharam tej mr and mrs ramacharai kannada movie telugu remake

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. ఇటీవలే ‘పిల్లానువ్వులేని జీవితం’ సినిమాతో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ హీరో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ చిత్రీకరణలో బిజీగా వున్నాడు. ఇప్పుడు తాజాగా చిరు ఇచ్చిన సలహా మేరకు ఇతనికి మరో ఆఫర్ వచ్చిందని సమాచారం!

కన్నడలో హిట్టయిన ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎన్.ఎస్.రాజ్ కుమార్ తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల చిరంజీవిని కలిసి, ఆ చిత్రాన్ని స్ర్కీనింగ్ చేశారు. ఆ మూవీ చూసిన అనంతరం చిరు దీనికి తన మేనల్లుడైతే బాగుంటాడని నిర్మాతకు సలహా ఇచ్చారట! దీంతో నిర్మాత రాజ్ కుమార్ అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తున్నారనీ తెలిసింది.

ఇక చిరు ఇచ్చిన సలహా కాబట్టి.. ఈ రీమేక్ లో నటించేందుకు సాయి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని యూనిట్ వర్గాల సమాచారం! ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడి కానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles