Rajendra prasad maa association president elections news murali mohan

rajendra prasad news, rajendra prasad press meet, rajendra prasad gossips, rajendra prasad interview, maa association president elections, maa association elections, murali mohan news

rajendra prasad maa association president elections news murali mohan : Natakireeti rajendra prasad has announced that he is participating in maa association president elections.

ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘నటకిరీటి’!

Posted: 03/03/2015 11:30 AM IST
Rajendra prasad maa association president elections news murali mohan

‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ కూడా ఇప్పుడు ఎన్నికల బరిలోకి అడుగిడుతున్నారు. నిన్నటివరకు వివాదాలకు దూరంగా వుంటూ, సినిమాలు చేసుకుంటూ కాలం గడిపిన ఆయన.. ఇప్పుడు సదరు పోటీల్లో పాల్గొంటున్నట్లుగా స్వయంగా ఆయనే ధృవీకరించారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కొత్త కార్యవర్గం కోసం మార్చి 29వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనే రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నారని సమాచారం! ప్రస్తుతం ఈ అసోసియేషన్‌కు నాటి హీరో, ఎంపీ మురళీ మోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. గత రెండేళ్లుగా ఈ అధ్యక్ష పదవిలో కొనసాగతున్న మురళీ మోహన్.. ఇప్పుడు మళ్లీ చేపట్టే ఆలోచన ఆయనకు లేదని తెలిసింది. ఈ క్రమంలోనే రాజేంద్రప్రాసాద్ తెరపైకి వచ్చి.. తాను పోటీ చేయనున్నట్లుగా వెల్లడించారు.

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా స్వయంగా వెల్లడించిన రాజేంద్రప్రసాద్.. తాను ఏకగ్రీవ ఎన్నికకు ప్రయత్నిస్తున్నాని తెలిపారు. ఒకవేళ వేరే ఎవరైనా ఈ అధ్యక్ష పదవిని ఆశిస్తూ పోటీకి దిగితే... వారితో ఎన్నికల్లో పోటి చేయడానికి తాను సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా.. 2013-15 దఫాకు కార్యవర్గంలోని కొన్ని ఇతర పదవులకు పోటీ జరిగినా.. అధ్యక్షుడిని మాత్రం ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. మరి.. ఈసారి కూడా అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుందా..? లేదా ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారా..? అనేది చూడాలి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maa association elections  rajendra prasad news  tollywood news  

Other Articles