Surya mass movie second look released

Surya Mass Movie Second Look, Surya Mass Movie, Surya Mass First Look, Surya Mass First Look Released, Mass Movie First Look Released,Mass Movie First Look, Surya Mass Movie posters, Surya Mass Movie news, Surya latest stills, Surya movie updates, Surya upcoming movie, Surya mass, surya

Surya Mass Movie Second Look Released: Here is The Second Look Photo of Tamil Hero Surya Move Titles as Mass...Mass is an Tamil Action Movie in Venkat Prabhu Direction.

సూర్య మాస్ స్టైలిష్ లుక్ సూపర్బ్

Posted: 03/03/2015 10:40 AM IST
Surya mass movie second look released

తమిళంలో ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘మాస్’ సినిమాను సూర్య స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇపుడు ఈ చిత్రాన్ని కూడా ఈరోస్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాను సూర్య మరియు ఈరోస్ సంస్థ సంయుక్తంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా తెలిసింది.

కమర్షియల్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘మాస్’ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సూర్య ఓ పవర్ ఫుల్ స్టైలిష్ మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీపావళి సంధర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన సూర్య ‘మాస్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

ఈ ఫస్ట్ లుక్ కు భారీ స్పందన వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ ను కాపీ కొట్టి, చాలా మంది హీరోల అభిమానులు అలాంటి ఫస్ట్ లుక్ లనే క్రియేట్ చేసేసుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో సూర్యకు సంబంధించిన మరో లుక్ ను విడుదల చేసారు. ఈ లుక్ లో సూర్య చాలా స్టైలిష్ గా వున్నాడు.

ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సూర్య సరసన నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ‘మాస్’ చిత్రం ఎలా వుండబోతుందని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. మరి ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యేవరకు వేచిచూడాల్సిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Mass Movie  Latest Look  

Other Articles