Ram charan responce on pawan kalyan movie offer

Ram charan responce on Pawan kalyan Movie offer, Ram charan Happy with Pawan kalyan Movie offer, Ram charan Happy with Pawan kalyan, Ram charan comments on Pawan kalyan Movie offer, Ram charan comments on Pawan kalyan, Pawan kalyan latest news, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Pawan kalyan press note, Ram charan latest news, Ram charan movie news, Ram charan movie updates, Ram charan latest tweets, Ram charan

Ram charan responce on Pawan kalyan Movie offer: Pawan Kalyan to produce Ram Charan film on Pawan Kalyan Creative Works banner.

పవర్ స్టార్ ఆఫర్ కు చెర్రీ ఫుల్ హ్యాపీ

Posted: 03/02/2015 10:21 AM IST
Ram charan responce on pawan kalyan movie offer

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందో తెలియదుగానీ.. త్వరలోనే పవన్ కళ్యాణ్ నిర్మాతగా ఓ సినిమా మాత్రం రూపొందనుందని తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానరైన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’పై ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా ఇటీవలే ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ బ్యానర్లో పవన్ నిర్మించబోయే తొలి చిత్రాన్ని తన అన్న తనయుడు రాంచరణ్ తో పవన్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయంపై పవన్ ప్రెస్ నోట్ విడుదల చేసాడు. అయితే పవన్ నిర్ణయానికి రాంచరణ్ చాలా సంతోషంగా వున్నాడు. ఈ విషయంపై రాంచరణ్ తన స్పందనను సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.

ఈ వార్తలపై రాంచరణ్ స్పందిస్తూ... ‘అవును నిజమే. కళ్యాణ్ బాబాయ్ తన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తుండటం చాలా సంతోషంగా వుంది. దానికంటే... బాబాయ్ మొదటి ప్రాజెక్టులో నేను భాగస్వామి అవ్వడం ఎంతో ఎగ్జైటింగ్ గా వుంది. లవ్ యు బాబాయ్’ అంటే తన సోషల్ మీడియా అఫీషియల్ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలియజేసాడు.

మరి పవన్ కళ్యాణ్ నిర్మించబోయే ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో వుండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ ‘గబ్బర్ సింగ్2’ సినిమా ప్రాజెక్టుతో బిజీగా వున్నాడు. అలాగే శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్ చేయబోయే సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక... పవన్, చరణ్ ల సినిమాలు సెట్స్ పైకి వెళ్తాయని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Comments  Pawan kalyan  Offer  produce  Responce  telugu  news  

Other Articles