Anushka rudhramadevi theatrical trailer response

Anushka Rudhramadevi theatrical trailer Response, Rudhramadevi theatrical trailer Release Date Confirmed, Rudhramadevi trailer Release Date Confirmed, Rudhramadevi theatrical trailer Release Date, rudramadevi teaser release date, rudramadevi teaser release confirmed, rudramadevi teaser release, rudramadevi latest news, rudramadevi movie news, rudramadevi news, rudramadevi teaser, rudramadevi trailers, rudramadevi temper movie, rudramadevi, temper news

Anushka Rudhramadevi theatrical trailer Response: Anushka, Rana, Allu arjun act in lead roles. Director Gunashekhar upcoming movie Rudramadevi. Rudramadevi first look teaser released.

అనుష్క రుద్రమదేవి ట్రైలర్ కు భారీ స్పందన

Posted: 03/02/2015 10:00 AM IST
Anushka rudhramadevi theatrical trailer response

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్ర షూటింగ్ గత ఏడాది డిసెంబర్ నెలలో పూర్తయ్యింది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలకు భారీ స్పందన వస్తోంది.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను మొన్న ఫిబ్రవరి 28న ప్రీమియర్ షో ద్వారా ప్రసాద్ ఐ మాక్స్ లో ప్రదర్శించారు. ఈ ట్రైలర్ ను చూసిన ప్రతిఒక్కరి నుంచి మంచి స్పందన లభించింది. సూపర్బ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రైలర్ నేడు(సోమవారం మార్చి 2) సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు.

Rudhramadevi-1

‘రుద్రమదేవి’ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి త్వరలోనే విడుదల కానున్న ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటించగా అల్లు అర్జున్ ‘గోనగన్నారెడ్డి’ పాత్రలో నటించాడు. ఇందులో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారగణం ముఖ్య పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ నెల చివర్లో ‘రుద్రమదేవి’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Rudhramadevi  theatrical trailer  Release Date  Confirmed  Gunashekhar  telugu  news  

Other Articles