Sonam kapoor admitted hospital swine flu symptoms

sonam kapoor news, sonam kapoor swine flu news, sonam kapoor gossips, sonam kapoor latest news, sonam kapoor photos, sonam kapoor latest news, salman khan news, anupam kher news, anil kapoor news

sonam kapoor admitted hospital swine flu symptoms : Bollywood fashion icon sonam kapoor admitted in hospital due to swine flu

బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ కి ‘స్వైన్ ఫ్లూ’ లక్షణాలు!

Posted: 02/28/2015 06:28 PM IST
Sonam kapoor admitted hospital swine flu symptoms

బాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ గా పేరొందిన సోనమ్ కపూర్.. స్వైన్ ప్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిందని సమాచారం!  ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె అయిన ఈమె.. ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు గుజరాత్ వెళ్లింది. తొలుత షూటింగ్ లో ఎంతో హుషారుగా పాల్గొన్న సోనమ్.. తర్వాత దగ్గు, తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. అక్కడి వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేని నేపథ్యంలోనే ఈమె అనారోగ్యం బారిన పడింది.

దీంతో యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను రాజ్కోట్లోని స్టెర్లిన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు ఆమెకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు భావిస్తున్నారు. గుజరాత్లో స్వైన్ ఫ్లూ ఎక్కువగా వుంది కాబట్టి.. ఆమెక్కూడా ఆ వ్యాధి లక్షణాలు సోకి వుంటాయని డాక్టర్లు అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే వ్యాధి నిర్ధారణ కోసం ఆమె బ్లడ్ శాంపిల్స్ను తీసుకున్నారు. ఈ వ్యా ధి సోకిందా..? లేదా..? అన్నది వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావాల్సివుంది. ఇదిలావుండగా.. సోనమ్ పాల్గొంటున్న సినిమా సెట్లో బాలీవుడ్ నటులు  సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonam kapoor swine flu  salman khan  anil kapoor  

Other Articles