Charmi kaur mass masala item songs 10 enradhukulla vikram samantha ar muragadoss

charmi kaur, charmi kaur latest news, charmi kaur item song, charmi kaur hot photos, charmi item songs, charmi photo gallery, samantha news, samantha ruth prabhu, samantha photo shoot, 10 enradhukulla movie news, 10 enradhukulla shooting schedules

charmi kaur mass masala item songs 10 enradhukulla vikram samantha ar muragadoss : Charmi kaur is doing another mass masala item song in 10 enradhukulla tamil Movie with chiyan vikram.

కోలీవుడ్ లోనూ చార్మీ తళుకు బెళుకులు..

Posted: 02/28/2015 06:09 PM IST
Charmi kaur mass masala item songs 10 enradhukulla vikram samantha ar muragadoss

గతకొన్నాళ్ల నుంచి హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో బొద్దుగుమ్మ ఛార్మీ ఐటెం సాంగులతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ అమ్మడు రామ్ చరణ్ ‘నాయక్’, కింగ్ నాగార్జున ‘డమరుకం’, ‘రగడ’ సినిమాలలో ఐటెం సాంగుల్లో నృత్యించి, యూత్ ని అలరించింది. ఆ పాటలన్నీ బాగా పాపులర్ అవడంతోపాటు ఛార్మికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు మరో మసాలా ఐటెం సాంగులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం! అది కూడా తమిళ సినిమాకోసం చేయడం విశేషం!

చియాన్ విక్రమ్ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘10 ఎణ్రదుకుళ్ల’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఆ సినిమాలోనే హీరో విక్రమ్ తో కలిసి చార్మి మంచి మాస్ మసాలా ఐటెం సాంగులో చిందేయనుంది. తమిళ స్టైల్లో సాగిపోయే ఈ పాట 9 నిమిషాల నిడివి వుంటుందని యూనిట్ బృందం తెలుపుతోంది. గురువారం నుండి ఈ పాట చిత్రీకరణ చెన్నైలో మొదలైంది. ఈ పాట కోసం 2.25 కోట్లు ఖర్చుపెట్టి స్పెషల్ సెట్ వేశారని సమాచారం. ఈ పాటతో సినిమాకు బాగా క్రేజ్ వస్తుందని మూవీ యూనిట్ ఆకాంక్షిస్తోంది.

ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు కమెడియన్ పాత్రలో నటిస్తున్నాడు. ఏఅర్ మురుగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles