Sunil next movie with vamshi krishna aakella

Sunil new movie with Raksha Director, Sunil new movie with Vamshikrishna Aakella, Actor sunil movie news, Actor sunil movies, Actor sunil stills, Actor sunil comedy, Actor sunil dance, Actor sunil songs, Actor sunil videos, Actor sunil latest news, Actor sunil

Sunil Next Movie with Vamshi krishna Aakella: Actor sunil upcoming movie in Raksha fame director Vamshi krishna Aakella.

ప్రేమకథా చిత్రమ్ నిర్మాతతో సునీల్ కొత్త చిత్రం

Posted: 02/28/2015 09:58 AM IST
Sunil next movie with vamshi krishna aakella

సునీల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ‘ర‌క్ష’ చిత్రం లాంటి విభిన్న క‌థాంశంతో విజ‌యాన్ని సొంతం చేసుకున్న వంశీకృష్ణ ఆకేళ్ల దర్శకత్వంలో ‘ప్రేమ‌క‌థా చిత్రమ్’ చిత్ర నిర్మాత ఆర్‌. సుద‌ర్శన్ రెడ్డి, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్‌.పి,ఏ. క్రియోష‌న్స్ ప‌తాకంపై ఓ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని నిర్మిచ‌నున్నారు. నేడు (ఫిబ్రవరి 28) హీరో సునీల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆర్‌.పి.ఏ. క్రియేష‌న్స్ ప్రోడ‌క్షన్ నెం-2 యూనిట్ స‌భ్యులంద‌రూ హీరో సునీల్ కి జ‌న్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఆర్‌.సుద‌ర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా మా హీరో సునీల్ పుట్టిన రోజు సంధ‌ర్బంగా మా చిత్ర యూనిట్ అంద‌రి త‌రుపునా జ‌న్మదిన శుభాకాంక్షలు. ‘ప్రేమ‌క‌థా చిత్రమ్’ త‌రువాత ఎన్నో క‌థ‌లు విన్నాను. కాని నా మెద‌టి ప్రయాత్నాన్ని చిన్న చిత్రాల్లో అఖండ విజ‌యంగా అందించిన తెలుగు ప్రేక్షకులంద‌రి అంచ‌నాలు అందుకునేలా... మా బ్యాన‌ర్ ఆర్‌.పి.ఏ.క్రియోష‌న్స్ స్థాయిని నిల‌బెట్టె చిత్రంగా వుండాల‌ని మంచి క‌థ‌ల కోసం చూస్తున్న స‌మ‌యంలో ‘ర‌క్ష’ చిత్రం ద‌ర్శకుడు వంశీకృష్ణ ఆకేళ్ళ మంచి క‌థతో నా ద‌గ్గర‌కి వ‌చ్చారు.

నేను, సునీల్ గారు కథ విన్న వెంట‌నే అంగీక‌రించాము. సునీల్ గారికి ఎలాంటి క‌థ వుండాల‌ని ప్రేక్షకులు కోరుకుంటారో... 100% అదే రేంజ్ క‌థ‌తో మా బ్యాన‌ర్ లో వ‌స్తున్నాము. సునీల్ గారి బాడీ లాంగ్వేజ్ కి కొత్తగా చూపించ‌బోతున్నారు ద‌ర్శకుడు వంశీ. ప‌క్కా కమ‌ర్షియ‌ల్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌టించే న‌టీన‌టుల వివ‌రాలు, సాంకేతిక‌ నిపుణ‌ుల వివ‌రాలు అతి త్వర‌లోనే తెలియ‌జేస్తాం అని అన్నారు.

ద‌ర్శకుడు వంశీకృష్ణ ఆకేళ్ళ మాట్లాడుతూ... ‘ర‌క్ష'’లాంటి హిట్ చిత్రం త‌రువాత క‌మ‌ర్షియ‌ల్ స‌క్సస్ కోసం ఎదురు చూస్తున్న నాకు అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులున్న ఈ క‌థ కుదిరింది. ఈ క‌థ‌ని సునీల్ గారికి చెప్పిన వెంట‌నే ఇలాంటి క‌థ కోస‌మే నేను వెయిట్ చేస్తున్నాను అని ఆయన అన్నారు. ఓ క‌మ‌ర్షియ‌ల్ క‌థని సునీల్ గారు హీరోగా చేయ‌టం, దానిని ఆర్‌. సుద‌ర్శన్ రెడ్డిగారు నిర్మించ‌టం చాలా సంతోషంగా వుంది అని అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor sunil  Vamshi krishna aakella  director  telugu  news  

Other Articles