Vishal chandrashekhar music for hanu raghavapudi movie

Vishal chandrashekhar music for Hanu Raghavapudi movie, Vishal chandrashekhar music for Nani movie, 14 REELS CASTING CALL FOR KIDS, 14 REELS CASTING CALL, 14 REELS CASTING CALL FOR nani movie, nani movie casting call, nani movie latest news, nani movie in 14 reels, nani movie casting call video, 14 REELS casting call, 14 REELS latest news, 14 REELS

Vishal chandrashekhar music for Hanu Raghavapudi movie: Director Hanu Raghavapudi next movie with Nani. 14 Reels entertainment is looking for some mischievous, funny and excited kids to star in it’s production no. 7.

నాని సినిమాకు రెహ్మన్ శిష్యుడి మ్యూజిక్

Posted: 02/27/2015 11:17 AM IST
Vishal chandrashekhar music for hanu raghavapudi movie

‘అందాల రాక్షసి’ ఫేం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో నాని హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో నిర్మాతలు రామ్ ఆచంట్, గోపి ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే కాస్టింగ్ కాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

3 - 4 సంవత్సరాలు వయసున్న పాప
6 - 8 సంవత్సరాలు వయసున్న బాబు
8 - 11 సంవత్సరాలు వయసున్న పాప
మీ పిల్లలు అల్లరిలో నెం.1 ఐతే వెంటనే మూడు ఫోటోలు, మరియు వాళ్ళు వీరవిహారం చేసిన వీడియోలు ఏమైనా వుంటే వెంటనే This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కి ఫిబ్రవరి 20th లోగా పంపండి. మీ పిల్లల అల్లరే మాకు కావలసిన ఎక్సపీరియన్స్ !! అంటూ ఓ ముగ్గురు చైల్డ్ ఆర్టిస్టుల కోసం కాస్టింగ్ కాల్ ప్రకటించారు.

ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ శిష్యుడు విశాల్ చంద్రశేఖర్ ను సంగీత దర్శకునిగా ఎంపిక చేసారు. విశాల్ చంద్రశేఖర్ గతంలో సంతోష్ శివన్ ‘ఇనమ్’ సినిమాకు సంగీతం అందించాడు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్లుగా తెలిసింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

ప్రస్తుతం నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal chandrashekhar  music  Nani  Hanu raghavapudi  14 REELS  castig call  kids  telugu  news  movies  

Other Articles