Rajinikanth linga movie rockline venkatesh bangalore court distributors controversy

rajinikanth news, rajinikanth linga movie, linga movie distributors, linga movie controversies, producer rockline venkatesh, bangalore court, linga movie collections, rajinikanth controversies, rajinikantha linga movie news, bangalore court linga movie, linga distributors controversy

rajinikanth linga movie rockline venkatesh bangalore court distributors controversy : Bangalore court prohibited linga movie distributors protests.

రజనీపై ఆందోళనలను నిషేధించిన బెంగుళూరు కోర్టు

Posted: 02/27/2015 11:13 AM IST
Rajinikanth linga movie rockline venkatesh bangalore court distributors controversy

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లింగ’ చిత్రం ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే! దీంతో ఈ చిత్రాన్ని భారీ రేటుకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తమకు జరిగిన నష్టాలను నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, అతని నిర్మాణ సంస్థ భర్తీ చేయాలని వాళ్లు గతకొన్నాళ్ల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ వ్యవహారంలో రజనీకాంత్ ప్రస్తావన తీసుకురావడంతోపాటు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు. తమకు జరిగిన అన్యాయంపై రజనీ స్పందించాలని, జరిగిన నష్టానికి ఆర్థిక సహాయం అందించాలని వేడుకున్నారు. నిరాహార దీక్షకు కూడా సిద్దమయ్యారు.

ఈ విధంగా వాళ్లు ఆందోళనలు చేపట్టడంతో నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కొద్దిమేర నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమయ్యారు అయితే.. ఆయన ఇచ్చే ఆ నష్టపరిహారంతో తమ నష్టాలు తీరవని మళ్లీ వాళ్లు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేష్.. ఈ పరిణామాలపై ఈ నెల 20వ తేదీన బెంగుళూరు కోర్టులో కేసు వేశారు. డిస్ట్రిబ్యూటర్లు రజినీకాంత్ పరువును బజారు కీడుస్తున్నారని, డబ్బులు చెల్లించాలంటూ తన నిర్మాణ సంస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన కేసులో పేర్కొన్నారు. అలాగే.. తమ చర్యలతో వారందరూ తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు.

ఈ కేసును విచారించిన బెంగుళూరు కోర్టు.. నిర్మాతకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మీడియా ముందు ‘లింగ’ సినిమా గురించి మాట్లాడడం.. విమర్శించడం.. రజినీకాంత్ ప్రస్తావన తీసుకురావడం.. ఆందోళనలు చేపట్టడం.. వంటి చర్యలపై కోర్టు నిషేధం విధించింది. ఇదిలావుండగా.. గతంలో తమిళ చిత్ర నిర్మాతల మండలి, నటీనటుల సంఘం డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన చర్యలను వ్యతిరేకిస్తూ.. రజినీకాంత్, నిర్మాతకు బాసటగా నిలిచిన విషయం విదితమే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles