Pragya jaiswal varun tej director krish combo movie updates

pragya jaiswal news, pragya jaiswal latest news, pragya jaiswal updates, varun tej latest movie, varun tej krish movie, varun tej movie news, varun tej kanche movie, varun tej kavacham movie, pragya jaiswal hot photos, varun tej pragya jaiswal

pragya jaiswal varun tej director krish combo movie updates : Pragya jaiswal is finalised as an actress in varun tej latest flick which is directed by jagarlamudi radhakrishna (krish).

వరుణ్ తేజ్ ప్రియురాలు దొరికిపోయింది..

Posted: 02/26/2015 07:16 PM IST
Pragya jaiswal varun tej director krish combo movie updates

‘ముకుంద’ చిత్రంతో డీసెంట్ హిట్ కొట్టి, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగాహీరో వరుణ్ తేజ్.. తన తదుపరి చిత్రం దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్)తో చేయనున్న విషయం తెలిసిందే! ఈనెల 27వ తేదీన ముహూర్త కార్యక్రమాలు ఘనంగా జరగనున్న ఈ చిత్రానికి ‘కంచె’, ‘కవచం’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం! మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ఈమె.. హిందీలో ‘టిట్టో ఎంబిఏ’, తమిళంలో ‘విరాట్టు’, ఇండో–కెనడియన్ ఫిల్మ్ ‘ఎ లిటిల్ హెవెన్ ఇన్ మీ’లో నటించింది. ప్రస్తుతం తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాలో నటిస్తోంది. ఆయా సినిమాల్లో ఈమె నటన చూసి దర్శకనిర్మాతలు ఇంప్రెస్ అయ్యారని, అందుకే ఆమెను ఈ సినిమాలో వరుణ్ సరసన నటించే అవకాశం ఇచ్చారని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

లవ్, రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం కథ రెండవ ప్రపంచయుద్ధ నేపధ్యంలో పీరియాడికల్ డ్రామాగా సాగుతుందని అంటున్నారు. అలాగే.. ఇందులో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని టాక్ కూడా వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో నిర్మాత రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pragya jaiswal  vatun tej latest flick  jagarlamudi radhakrishna  

Other Articles