Akkineni nagarjuna mythri kannada movie special show hyderabad city

akkineni nagarjuna news, akkineni nagarjuna movies, mythri kannada movie, kannada mythri telugu remake, nagarjuna mythri special show, nagarjuna mythri telugu remake, producer raj kumar, nagarjuna kannada movie, nagarjuna mythri movie, mohan lal news, puneet raj kumar news

akkineni nagarjuna mythri kannada movie special show hyderabad city : Producer rajkumar preparing a special show of kannada movie Mythri for akkineni nagarjuna in hydeabad.

నాగార్జున కోసం హైదరాబాద్ లో ‘మైత్రి’ స్పెషల్ షో..

Posted: 02/25/2015 09:11 PM IST
Akkineni nagarjuna mythri kannada movie special show hyderabad city

టాలీవుడ్ మన్మథుడు నాగార్జన కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో ‘మైత్రి’ స్పెషల్ షో ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఇదేదో డ్యాన్సింగ్ షోగానీ, చారిటీ షోగానీ, టీవీ ప్రోగ్రామ్ గానీ, ఏదో ఒక మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ అయితే కాదులెండి! ఇటీవలే కన్నడంలో విడుదలై ఘనవిజయం సాధించిన ‘మైత్రి’ చిత్రం స్పెషల్ షో!

మోహన్ లాల్, పునిత్ రాజ్ కుమార్ హీరోలుగా నటించిన ‘మైత్రి’ చిత్రం కన్నడంలో సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బాల నేరస్థుల జీవితాన్ని స్పష్టంగా చూపించారు. దీంతో.. కమర్షియల్ ఫార్మాట్ లో మంచి మెసేజ్ ని అందించారంటూ ఈ చిత్రానికి విమర్శకులు నుంచి ప్రశంసలు లభించాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది ఈ చిత్రం. ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రీమేక్ చేయాలని ఈ మూవీ నిర్మాత ఎన్.ఎస్. రాజ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు రీమేక్ లో ఓ ప్రధాన పాత్రలో నాగార్జునను తీసుకోనున్నట్లుగా నిర్మాత వెల్లడించారు.

ఇదే విషయమై నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘నాగార్జునతో మైత్రి రీమేక్ గురించి చర్చలు జరిగాయి. అయితే ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉండడం వలన పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదు. తెలుగు రీమేక్ లో ఆయన్నే హీరోగా నటింపచేయాలని అనుకుంటున్నాం. త్వరలోనే ఆయనకోసం హైదరాబాద్ లో స్పెషల్ షో ఏర్పాటు చేస్తున్నాం. ఈ సినిమా ఆయనకు నచ్చతుందని నమ్మకం వుంది. ఇందులో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ స్పష్టం చేశాడు. అంటే.. ఈ మూవీ స్పెషల్ షో అయ్యేంతవరకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? లేదా..? అన్నది సస్సెన్స్ గానే వుంటుందన్నమాట!

ఇదిలావుండగా.. ప్రస్తుతం నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న మరో సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఆ మల్టీ స్టారర్ సినిమాలో కార్తి మరో హీరో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni nagarjuna  mythri kannada movie  mythri telugu remake  producer raj kumar  

Other Articles