Dhanush rajinikanth role shamitabh movie director balki amitabh bachchan

dhanush news, rajinikanth news, dhanush rajinikanth, shamitabh movie news, shamitabh movie, dhanush rajinikanth amitabh, director balki news, akshara hassan news, rajinikanth real life story, dhanush rajinikanth role, aishwarya rajinikanth

dhanush rajinikanth role shamitabh movie director balki amitabh bachchan : According to the bollywood sources.. Hero Dhanush is playing his father in law rajinikanth real life role in shamitabh movie.

తెరవెనుక రజనీ.. తెరముందు ధనుష్!

Posted: 01/29/2015 05:38 PM IST
Dhanush rajinikanth role shamitabh movie director balki amitabh bachchan

మామఅల్లుళ్లయిన రజనీకాంత్, ధనుష్ ఇద్దరూ కలిసి ఇప్పటివరకు ఏ మూవీలోనూ నటించలేదు. వ్యక్తిగతంగా మంచి రిలేషన్ వున్నప్పటికీ.. ఇద్దరు కలిసి తెరను పంచుకున్న సందర్భాలు లేవు. అయితే తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం.. తెరవెనుకున్న రజినీని చూసి, ధనుష్ తెరపై చేసి చూపిస్తున్నాడని సమాచారం!

ప్రముఖ దర్శకుడు ఆర్.బాల్కి దర్శకత్వంలో అమితాబ్ ప్రధానపాత్ర పోషించిన ‘షమితాబ్’ చిత్రంలో ధనుష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే! ఇందులో రజనీకాంత్ రియల్ లైఫ్  పాత్రతో ధనుష్ నటించనున్నాడని సమాచారం! బస్ స్టాండులో తినుబండారాలు అమ్ముకునే కుర్రాడిగానూ.. తర్వాత బస్ కండక్టర్’గానూ పనిచేస్తూ చివరకు సూపర్ స్టార్’గా ఎదిగే పాత్రలో ధనుష్ కనిపిస్తాడని చిత్రబృందం తెలుపుతోంది. అంటే.. ఈపాత్ర దాదాపు రజనీకాంత్ జీవితాన్ని పోలి వుంటుందని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు.. ఆయన జీవితంలో ఎదురైన కొన్ని ఆసక్తికర సంఘటనలను కూడా ఈ మూవీలో జోడించారట!

ఇదే విషయమై మూవీ ఆడియో రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ బాల్కీ కూడా ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ మూవీలో హీరో కష్టపడి హీరోగా ఎలా ఎదుగుతాడోనన్నది కథ అని ఆయన తెలిపాడు. దీన్ని బట్టి చూస్తుంటే.. ఈ మూవీ రజనీ రియల్ లైఫ్ స్ఫూర్తితోనే తెరకెక్కినట్లు భావిస్తున్నారు. అయితే.. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు చాలా గోప్యంగా వుంచుతున్నారు. రిలీజ్’కి ముందే కథ లీకైతే తమ చిత్రం క్రేజ్ తగ్గిపోతుందని ఉద్దేశంతో దీనిపై ఏమాత్రం స్పందించడం లేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhanush rajinikanth  shamitabh movie  amitabh bachchan  akshara hassan  

Other Articles