ఒకప్పుడు చిత్రపరిశ్రమలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన కొందరు తారలు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్’లోనూ ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే! ఈ జాబితాలో చాలామంది లేరుకానీ.. కొందరు మాత్రం సక్సెస్’ఫుల్’గా దూసుకుపోతున్నారు. హీరోహీరోయిన్లకు అమ్మగానో, ఆంటీగానో, విలన్ల క్యారెక్టర్లలోనో, ఇంకా ఇతరత్ర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి చేరడానికి మరో తార రాశి సిద్ధమవుతోందని తాజా సమాచారం!
ఫ్యామిలీ, డ్రామా కథా చిత్రాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన నిన్నటితరం కథానాయిక రాశి.. మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇతర తారలలాగే సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించే అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని ఈమె చెబుతోందట! సాధారణ పాత్రలు కాకుండా మాంచి పవర్’ఫుల్ క్యారెక్టర్లు కావాలని ఈమె దర్శకనిర్మాతలకు సమాచారం చేరవేస్తోంది. విలన్ క్యారెక్టర్లోనైనా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట!
ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఒక్క విషయంలో మాత్రం రాశి వెనకడుగు వేస్తోందట! హీరోలకు, హీరోయిన్లకు అమ్మగా మాత్రం నటించనని కండిషన్లు పెడుతోందని చెబుతున్నారు. అవసరమైతే వారికి అక్కగానూ, ఆంటీగానూ నటించే పాత్రలైతే రెడీ అంటోంది. మరి.. ఈమె కోరుకుంటున్నట్లుగా ఎవరైనా ఆఫర్లు ఇస్తారా..? అలాకాకుండా కేవలం అమ్మ పాత్రలే ఎక్కువగా వస్తే రాశి అందుకు ఏ నిర్ణయం తీసుకుంటుంది..? ఇవన్నీ తెలియాలంటే ఆమె ఆఫర్లు వచ్చేవరకు ఆగాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more