Sushma raj ego attitude girl telugu film industry hero sumanth

sushma raj latest news, sushma raj hot photos, sushma raj hot photo shoot, sushma raj hot gallery, sushma raj photo session, sushma raj sexy stills, sushma raj sumanth movie, sushma raj sumanth stills, sushma raj affairs, sushma raj love, sushma raj hot videos

sushma raj ego attitude girl telugu film industry hero sumanth : the sexy beauty sushma raj got movie offer opposite to sumanth. This movie will go on floor in few days.

చలాకీ ‘మాయ’లాడీ..!

Posted: 01/27/2015 01:58 PM IST
Sushma raj ego attitude girl telugu film industry hero sumanth

తాము నటించిన చిత్రాలు హిట్ అయితే చాలు.. కొందరు తారలు కాస్త ఓవర్’గా బిహేవ్ చేస్తారు. ముఖ్యంగా ఇటీవలే టాలీవుడ్’లో ఎంట్రీ ఇచ్చిన కొత్త తారలైతే మరీ రెచ్చిపోతుంటారు. కానీ.. ఇండస్ట్రీలో అణిగివుంటేనే ఆఫర్లు వస్తాయన్న సూత్రాన్ని వంటబట్టించుకోవడంతో తమ ఇగోను కంట్రోల్’లో వుంచుకుంటారు. అయితే.. ఓ మాయాలాడి సుష్మారాజ్ మాత్రం చలాకీగానే వుంటూ తమ ఇగోను ప్రదర్శిస్తోందని ఇండస్ట్రీలో వార్తలు జోరందుకున్నాయి. ఈ అమ్మడు నటించింది కేవలం రెండుమూడు సినిమాలే అయినా.. కాస్త ఓవర్’గానే బిహేవ్ చేస్తోందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అయితే.. ఈమె ఈ విధంగా బిహేవ్ చేస్తోంది రియల్ లైఫ్ కాదులెండి... రీల్ లైఫ్ లో!

‘మాయ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అందాలతార సుష్మారాజ్.. ఆ మూవీలో తన నటనతో దర్శకనిర్మాతలతోపాటు ప్రేక్షకులనూ బాగానే ‘మాయ’ చేసింది. దాంతో ఈ అమ్మడికి ‘జోరు’ అనే చిత్రంలో నటించే ఆఫర్ వచ్చింది. ఆ మూవీలో ఈ భామ తన అందాలజోరును పెంచేసి అందరినీ హీటెక్కించేసింది. ఈ రెండు చిత్రాల్లో ‘మాయ’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు సాధించలేదు. ఇక ‘జోరు’ ఫ్లాప్ టాక్’తో బోల్తాపడిపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడికి ఆఫర్ల వెల్లువ తగ్గలేదు. నటనతోపాటు గ్లామర్’ను కూడా ఆ చిత్రాల్లో బాగానే ఒలకబోయడంతో ఈ అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు ఓ అవకాశం వచ్చింది.

సుమంత్ హీరోగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో హీరోయిన్’గా సుష్మా రాజ్ ఎంపికైనట్లు సమాచారం! ఇందులోనే ఈ అమ్మడు ఓ చలాకీ అయిన అమ్మాయి పాత్రలో నటించనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఈమె పాత్ర గతసినిమాలకంటే భిన్నంగా వుంటుందని, పైగా కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా వుంటాయని యూనిట్ బృందం తెలుపుతోంది. ఒకవేళ ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే.. ఈమె క్రేజ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sushma raj tollywood  telugu heroines  telugu news  

Other Articles