Anjali clarifies the tabla incident

Anjali, anjali issue, anjali tabla issue, Anjali clarifies on tabla incident, Anjali boozed, Anjali clash with media, Anjali clash with pub management, anjali and friends boozed, anjali clarifies pub incident, Actress Anjali, Anjali latest news, Anjali movies, Anjali photos, Anjali movie, Anjali movie collections, Anjali latest news, Anjali latest updates, Anjali upcomming movies,

Actress Anjali gives clarification on the incident taken place at tabla pub.

అంతా ఓ వర్గం మీడియా ఫోటోగ్రఫర్లే చేశారు..

Posted: 01/25/2015 04:46 PM IST
Anjali clarifies the tabla incident

బొమ్మరిల్లు సినిమాలోని డైలాగ్ నటి అంజలికి బాగా నచ్చింది. అదేంటో తెలుసా హీరో తన తండ్రితో అంతా మీరే చేశారు.. నాన్నా అంటారుగా అదే. ఇప్పుడు అంజలి కూడా అవసరమైన ప్రతీ చోటా ఈ డైలాగ్ నే విరివిగా వాడుతున్నట్లు సమాచారం. తాజాగా తన స్నేహితురాళ్లతో కలసి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తబలా పబ్ కు వచ్చి.. అక్కడ కొద్దిగా హల్ చేసిన ఘటనపై అంజలి వివరణ ఇచ్చింది. తాను పబ్ లో తాగి హల్ చల్ చేశానన్న వార్తలను ఖండించారు. ఓ వర్గానికి చెందిన మీడియా ఫోటోగ్రాఫర్లు తనపై పనిగట్టుకుని బురదచల్లే యత్నం చేస్తోందని ఆమె మండిపడింది.

ఆదివారం మీడియాతో మాట్లాడిన అంజలి.. తాను తబలా రెస్టారెంట్కు వెళ్లిన మాట వాస్తవమేనని.. అయితే అక్కడ తాగి ఏదో చేశానని మీడియా హడావుడి చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. 'నేను ఫ్రెండ్స్ కలిసి శుక్రవారం తబలా రెస్టారెంట్ కు వెళ్లాను. మా ఫ్రెండ్స్ తో పాటు వారి భర్తలు కూడా వచ్చారు.ఈ క్రమంలోనే కొంతమంది మీడియా  ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసుకోవడానికి నన్ను సంప్రదించారు.అయితే ఆ సమయంలో వారి విన్నపాన్ని మర్యాద పూర్వకం తిరస్కరించాల్సి వచ్చింది. ఇలా తిరస్కరించిన 15 నిమిషాల్లోనే లేనిపోని రూమర్లు కొన్ని టెలివిజన్ ఛానెల్ లో వచ్చాయి. ఇది కేవలం ఆ ఫోటోగ్రాఫర్లు సృష్టించిందే. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు' అని అంజలి తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anjali  tabla pub  clarification  photographers  

Other Articles