I telugu theatrical trailer

i movie, i telugu movie, i telugu trailer, i manoharudu telugu trailer, i telugu movie teaser, i telugu songs, i telugu audio release, i telugu latest updates, i telugu photos, i movie wallpapers, i movie latest updates, vikram latest photos, vikram upcoming movies, vikram health problem, vikram i movie posters, i movie release updates, i movie telugu theatres list, tollywood latest, tollywood update

I Telugu Theatrical Trailer : shankar chiyan vikram combination wonder i movie released telugu version theatrical trailer on 26th december. i manoharudu movie post production works comes to end. i movie getting ready to release for sankranti

ప్రేయసిని చంపుతున్న మనోహరుడు

Posted: 12/27/2014 08:35 AM IST
I telugu theatrical trailer

యావత్ దేశం ఎదురుచూస్తున్న శంకర్ వండర్ క్రియేషన్ ‘ఐ’ తుది దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా లేటెస్ట్ తెలుగు ట్రైలర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. శుక్రవారం రాత్రి విడుదల అయిన ఈ ట్రైలర్ విక్రమ్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. గతంలో వచ్చిన తమిళ ట్రైలర్ కు ఇది తెలుగు డబ్బింగ్ వర్షన్. తెలుగులో ఈ సినిమా ఆడియో నెలాఖరున విడుదల అవుతుందని ఈ మద్యే మూవీ యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మళయాళ, హిందీ ఇతర ప్రాంతీయ భాషలు సహా.., ప్రపంచంలోని ఇతర భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది. ఇందుకోసం డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. డిస్ర్టిబ్యూటర్లు కూడా సినిమాను కొనేసి.., విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. సెన్సార్ బోర్డు కూడా మూవికి యు/ఎ సర్టిఫికెట్ తో విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తేది కన్ఫర్మ్ చేయకపోయినా.., సంక్రాంతికి విడుదల అని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఏ తేదీన థియేటర్లను ‘ఐ’ రికార్డులు బద్దలుకొడతాయా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

180కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఐ’ మూవీకి విడుదలకు ముందే వచ్చిన డిస్ర్టిబ్యూషన్ డిమాండ్ రికార్డు స్థాయి కలెక్షన్లు తీసుకువస్తోంది. కాగా.., మూవీ యూనిట్  పన్ను తగ్గించుకునే పనిలో పడింది. క్లీన్ యు సర్టిఫికెట్ వస్తే..., తమిళనాడులో పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో యు/ఎ సర్టిఫికెట్ ను ‘యు’గా మార్చుకునేందుకు సినిమాను రీ సెన్సార్ చేయించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ గురించి మరిన్ని అప్ డేట్స్ అందిస్తాము. ప్రస్తుతానికి తెలుగు ట్రైలర్ మీకోసం అందిస్తున్నాము.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i movie  vikram movie  shankar latest  

Other Articles