Pawan kalyan venkatesh movie golpala gopala shriya first look

gopala gopala shryia first look, gopala gopala shryia photos latest, gopala gopala movie release date, gopala gopala movie audio launch, gopala gopala latest photos wall papers, gopala gopala cast and crew, pawan kalyan photos in gopala gopala, venkatesh in gopala gopala, tollywood latest updates

pawan kalyan venkatesh movie golpala gopala shriya first look : pawan kalyan god role playing gopala gopala movie unit releases power star first look as well as venkatesh also but latest leak reveals shriya first look in the movie

గోపాల గోపాల శ్రీయ ఫ్టస్ లుక్ ఫొటో

Posted: 12/24/2014 11:06 AM IST
Pawan kalyan venkatesh movie golpala gopala shriya first look

పవన్ లేటెస్ట్ మూవీ ‘గోపాల గోపాల’లో ఇప్పటివరకు పవన్ ఫస్ట్ లుక్ చూశాము, వెంకటేష్ సోలో ఫస్ట్ లుక్ చూశాము. కానీ మూవీలో హీరోయిన్ గా ఉన్న శ్రియ ఫస్ట్ లుక్ మాత్రం చూడలేదు. అయితే రెండ్రోజులగా సోషల్ మీడియాలో ఓ ఫొటో శ్రియ ఫస్ట్ లుక్ పేరుతో హల్ చల్ చేస్తోంది. ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ (కృష్ణుడి) భక్తురాలిగా శ్రియ నటిస్తుండటంతో ఈ ఫొటో చూసిన వారంతా మూవీకి సంబంధించిన స్టిల్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. శ్రియ లుక్ అంటూ తెగ షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోను మీ కోసం అందిస్తున్నాము.

పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమాలో వెంకటేష్ వ్యాపారస్తుడి పాత్రలో నటిస్తున్నాడు. విక్టరీ స్టార్ భార్యగా, పవన్ భక్తురాలిగా శ్రియ కన్పించనుది. హిందీ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాఢ్’ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నెలాఖరులో మూవీ ఆడియో లాంచ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. మూవీలో పాటలు తక్కువగా ఉంటాయని టాక్ విన్పిస్తున్నా.., అనూప్ మ్యూజిక్ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు చాలా మంచి స్పందన వచ్చింది. ఇక పవన్ సినిమా కోసం బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ ప్రత్యేకంగా ఓ పాట పాడారు.

కొద్దికాలంగా అవకాశాలు తగ్గిన శ్రియ ఈ మూవీపై భారీగా ఆశలు పెట్టుకుంది సినిమా హిట్ అయితే ఢిల్లీ భామకు మళ్ళీ ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. మరి కృష్ణుడు భక్తురాలిని కరుణిస్తాడో.., లేక వదిలేస్తాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala updates  shryia first look photos  pawan kalyan latest  

Other Articles