Mahesh babu koratala shiva movie title announce update

mahesh babu latest movie title, mahesh babu koratala shiva movie title announced, mahesh babu movie latest updates, mahesh babu srimanthudu movie first look wallpapers, balakrishna warrior movie first look, warrior movie trailer, balakrishna satya deva movie updates, tollywood latest news updates

mahesh babu koratala siva movie title announce update : tollywood super star mahesh babu is doing with koratala shiva now shooting in brisk place latest update is that, movie unit may release title on the occasion of new year

బాలయ్యకు పోటిగా ఏదో ఒకటి దించేస్తాడట

Posted: 12/24/2014 09:09 AM IST
Mahesh babu koratala shiva movie title announce update

నందమూరి ఫ్యాన్స్ తో సూపర్ స్టార్ అభిమానులు ఇప్పటినుంచే పోటిని ఎదుర్కోక తప్పేలా కన్పించటం లేదు. అభిమానులకు న్యూ ఇయర్ కానుకగా బాలయ్య సినిమా టీజర్ విడుదల అవుతుందని ప్రకటించగా.., ఇప్పుడు మహేష్ కూడా ధీటుగా బదులిస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ నటిస్తున్న సినిమా టీజర్ లేదా ఫస్ట్ లుక్ కూడా కొత్త సంవత్సర కానుకగా విడదల అవుతుందని మూవీ యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనిపై కాస్త గందరగోళం ఉంది. కొందరు టీజర్ వస్తుందనీ.., మరికొందరు ఫస్ట్ లుక్ వస్తుందని అంటే ఈ రెండూ కాదు టైటిల్ విడుదల అవుతుందని ఇంకొందరు చెప్తున్నారు.

ఏదయితేనే న్యూ ఇయర్ కానుకగా అభిమానులకు ఏదో ఒకటి అందించేందుకు సూపర్ స్టార్ మూవీ యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న మూవీలో మహేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పెట్టారని గుసగుసలు విన్పించాయి. దీనిపై మూవీ యూనిట్ స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు. దీంతో ఇదే టైటిల్ కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ చెప్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది.

 నందమూరి బాలయ్య విషయానికి వస్తే.., సత్యదేవ డైరెక్షన్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఈ మద్య విడుదల అయిన ఫస్ట్ లుక్ కు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12గంటలకు టీజర్ విడుదల చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీకి కూడా టైటిల్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ‘లయన్’ అని ముందుగా అనుకున్నా.., టైటిల్ వివాదం నేపథ్యంలో ‘వారియర్’ అని టాక్ విన్పిస్తోంది. ఈ మూవీ టైటిల్ పై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu koratala shiva  balakrishna warrior updates  tollywood latest  

Other Articles