Manchu vishnu next movie heroine tridha chaudary

manchu vishnu movie heroine, tridha chaudary manchu vishnu movie heroine, tridha chaudary latest updates, manchu vishnu latest movie cast and crew, adah sharma rejectes manchu vishnu movie, allu arjun adah sharma movie update, tollywood latest updates

manchu vishnu next movie heroine tridha chaudary : manchu vishnu movie unit confirms tridha chaudary for his next movie, rumors that because of vishnu low popularity and failure track record only adah sharma rejected manchu vishnu movie offer

ఆమె‘దా’ నో చెప్పింది.., ఈమె‘దా’ ఒకే అంది

Posted: 12/18/2014 03:46 PM IST
Manchu vishnu next movie heroine tridha chaudary

పైసా.., లేదా పేరు ఈ రెండిటిలో ఏదైనా ఒకటి ఉంటనే ఎవ్వరైనా దగ్గరకు వస్తారు. హీరో మంచు విష్ణు దగ్గర డబ్బులు ఉండవచ్చు కానీ..., ఆయన సినిమాల ట్రాక్ రికార్డు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే కాబోలు సన్నని మెరుపు తీగ అదా శర్మ వదిలేసి వెళ్లిపోయింది. ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో ఇండస్ర్టీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బిజీ హీరోయిన్ అయింది. అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా స్థాయికి ఎదిగింది. దీంతో పాటు మిగతా స్టార్ హీరోలు కూడా ఆఫర్లు ఇస్తామంటూ వరుసగా ఫోన్లు చేస్తున్నారట. ఇంత డిమాండ్ ఉండగా.., మంచు వారి సినిమాలో చేయాలా అని ఆలోచించి.., అమ్మడు నో చెప్పిందట. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదే గుసగుసలు విన్పిస్తున్నాయి.

విష్ణుతో ప్రాజెక్టు అంటే తన రేంజ్ సినిమా కాదని చెప్పలేక.., సింపుల్ గా సారి చెప్పేసిందని అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో చెప్పలేము కానీ.., ఇదే నిజమైతే మాత్రం మంచు ఫ్యామిలికి జరిగిన ఘోర అవమానంగా భావించాలి. అదా కాదు అనటంతో.., ప్రాజెక్టులోకి త్రిదాను తీసుకున్నారట. రెమ్యునరేషన్, కాల్షీట్లు మిగతా పనులన్నీ పూర్తయినట్లు విష్ణు సన్నిహితులు చెప్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ను కాపాడేందుకు మంచు విష్ణు బ్యాంకాక్ వెళ్ళి మరీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడట.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అరిమ నంబి’ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను ‘ప్రస్థానం’,‘ఆటోనగర్ సూర్య’ వంటి సినిమాలు తీసిన దేవ కట్ట డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న మూవీ షూటింగ్ మంచు విష్ణు హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రారంభం కానుంది. ఈ సినిమా అయినా హిట్ ఇచ్చి.., మంచు ఫ్యామలికి జరిగిన అవమానంను పూడ్చాలని కోరుకుందాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles