Ntr sukumar movie shooting started

ntr sukumar movie started, ntr sukumar movie shooting, ntr sukumar movie latest updates, ntr sukumar movie shooting photos, ntr sukumar movie heroine, ntr sukumar movie cast and crew, ntr sukumar movie title name, ntr temper movie latest updates, sukumar latest movie updates, tollywood latest updates

ntr sukumar movie shooting started : junior ntr sukumar new project movie launched on 18th december in a simple programme, ntr gearig up for sukumar movie, changing body language for the story movie pooja programmes is performed on 18th december

అప్పుడు అవమానించి ఇప్పుడు అవకాశం.. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అప్ డేట్స్

Posted: 12/18/2014 01:23 PM IST
Ntr sukumar movie shooting started

జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ‘టెంపర్’ సినిమా షూటింగ్ పూర్తి చేయకముందే.., సుకుమార్ సినిమాలోకి వెళ్తానని గతంలో చెప్పినట్లగా చేశాడు. సుకుమార్ తో రానున్న మూవీ లాంచ్ అయింది. కొద్దిమంది వ్యక్తుల సమక్షంలో సినిమా ప్రారంభ కార్యక్రమాలు నిర్మాత ప్రసాద్ కార్యాలయంలో గురువారం జరిగాయి. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మూవీకి ఇంకా టైటిల్ పెట్టలేదు. అటు హీరోయిన్ గా తమన్నా, రాశికన్నా, పూజా హెగ్డే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాని ఇంకా ఎవర్నీ ఎంపిక చేసినట్లుగా ప్రకటించలేదు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడుగా ఖరారయ్యాడు. గతంలో ‘టెంపర్’ మూవీకి ముందుగా దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుని ఆ తర్వాత పలు కారణాలతో అనూప్ కు అవకాశం ఇచ్చారు. మిగతా విషయాలు చూస్తే.., ఈ సినిమాలో ఎన్టీఆర్ ను గతంలో ఎప్పుడూ చూపించని యాక్షన్ హీరోగా తెరకెక్కించే అవకాశం ఉంది. నందమూరి హీరోను కొత్తగా చూపించేందుకు సుకుమార్ భారీ కసరత్తే చేశాడని తెలుస్తోంది. అటు డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చూసి ఫిదా అయిన ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ను సినిమా కోసం మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాడట. ఈ మూవీకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పనిచేస్తున్నారు.

ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమా షూటింగ్ చివరిదశలో ఉండగా పలు కారణాలతో ఆగిపోయింది. తాజా నిర్ణయంతో సంక్రాంతికి సినిమా చూద్దామనుకున్న నందమూరి ఫ్యాన్స్ నిరాశలో పడిపోయారు. మూవీ ఆగిపోవటం పట్ల అభిమానులు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పోటి మద్య కలెక్షన్లు ఎక్కువగా రావన్న ఉద్దేశ్యంతోనే సినిమాను ఆపేసినట్లు టాక్ విన్పిస్తోంది. తారక్ పోలిస్ ఆఫీసర్ గా వస్తున్న ‘టెంపర్’ సినిమాలో మంచి యాక్షన్ పార్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. వక్కంతం వంశీ కథను అందించగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో పూర్తి చేసుకుని, వేసవిలో విడుదల అవుతుందని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntr sukumar movie launch  ntr temper movie  tollywood latest  

Other Articles