Rajinikanth become grand father soundarya delivery

rajinikanth become grand father, rajinikanth second daughter, rajinikanth daughter soundarya, rajinikanth daughter saundarya delivery, rajinikanth daughter latest updates, rajinikanth lingaa movie updates, rajinikanth latest news updates, koliwood latest updates

rajinikanth become grand father soundarya delivery : tamil super star rajinikanth to become grand father again, his daughter saundarya is pregnant now and deliver soon, rajini fans ready to celebrate and waiting to hear super star daughter daughter's delivery

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఓ శుభవార్త

Posted: 12/18/2014 10:46 AM IST
Rajinikanth become grand father soundarya delivery

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఓ శుభవార్త. త్వరలోనే రజినీ మరోసారి తాత కాబోతున్నాడట. సూపర్ స్టార్ రెండవ కూతురు సౌందర్య ప్రస్తతం గర్భంతో ఉన్నట్లు కుటుంబ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే ఆమె ప్రసవిస్తుందని అంటున్నారు. దీంతో మరోసారి తాత అయ్యేందుకు రజినీ సిద్దమవుతున్నాడన్నమాట. ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్ కుమార్ ను 2010లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తండ్రితో ‘కొచ్చాడియన్’ సినిమాను తీసి డైరెక్టర్ గా ఇండస్ర్టీకి పరిచయం అయింది.

సూపర్ స్టార్ రజినీ పెద్ద కూతురు ఐశ్వర్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమిళనాట ‘లింగా’ హిట్ కావటంతో ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్న రజినీ ఫ్యాన్స్ త్వరలోనే మరోసారి వేడుకల కోసం రెడీ అవుతున్నారు. వివాదాల మద్య విడుదల అయిన ‘లింగా’ మూవీకి తమిళనాడులో తప్ప మిగతా చోట్ల ఆశించిన స్పందన రాలేదు. సినిమాకు ఫ్లాప్ టాక్ రాకపోయినా.., కమర్షియల్ గా మార్కెట్ చేయలేకపోయింది. టైమ్ రన్ ఎక్కువగా ఉందని భావించి ఫస్ట్ ఆఫ్ లో ఆరు నిమిషాలు సెకండ్ ఆఫ్ లో మూడు నిమిషాలు తొలగించి బుధవారం నుంచి ప్రదర్శిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth daughter  soundarya delivery  koliwood latest  

Other Articles