I hindi trailer pk movie release december 19th

i hindi traielr, i hindi trialer with pk movie, i hindi trialer latest update, pk movie latest news, pk movie trailers teaser, pk movie latest photos, pk movie theatres list, pk movie cast and crew, tollywood latest news updates, koliwood latest updates, aamir khan movies

i hindi trailer pk movie release december 19th : koliwood persons saying that ‘I’ Hindi trailer will be released along with Aamir Khan’s PK movie which will be released on December 19th.

తెలుగులో రాలేదు.., హిందీ మాటేమిటో...?

Posted: 12/18/2014 09:57 AM IST
I hindi trailer pk movie release december 19th

దేశంలోని సినిమా ఇండస్ర్టీలన్ని ప్రస్తుతం మాట్లాడుకుంటోంది ‘ఐ’ మూవీ గురించే. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ ను తలదన్నే రీతిలో తెరకెక్కిన ఈ సినిమాపై సినిమా వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. మరోవైపు ఫ్యాన్స్ శంకర్ ఏం మాయ చేశాడో చూద్దామని ఎదురుచూస్తున్నారు. ఇలా అందరూ ఈ సినిమా గురించి హాట్ హాట్ గా మాట్లాడుకుంటుంటే.., మూవీ యూనిట్ మాత్రం దోబూచులాడుతోంది. సినిమా విడుదల అక్టోబర్ లో అని చెప్తే డిసెంబర్ కు కూడా అయ్యేలా కన్పించటం లేదు. అన్ని పనులు ముగించుకుని జనవరిలో విడుదల చేస్తామని చెప్తున్నారు. కనీసం ట్రైలర్లు కూడా అనుకున్న తేదికి రాకపోవటం పట్ల అభిమానులు పెదవి విరుస్తున్నారు.

ఈనెల 17న ‘ఐ’ తెలుగు ట్రైలర్ విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. తొలి ట్రైలర్ చూసి విక్రమ్ పై క్రేజుతో రెండవది ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. బుదవారం రోజు తెలుగు ట్రైలర్ రాకపోవటంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. శంకర్ ఎందుకిలా వాయిదాలేస్తూ వేధిస్తున్నాడు అని బాధపడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమంటే.. ఈనెల 19న ‘ఐ’ హింది ట్రైలర్ వస్తుందట. అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ మూవీ తో పాటు ఈ ట్రైలర్ ను కూడా విడుదల చేస్తారని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. 17న రావాల్సిందే ఇప్పటివరకు రాకపోవటంతో.., 19గురించి ఎలా ఆశ పెట్టుకోవాలి అని ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి మూవీ యూనిటే సమాధానం చెప్పాలి.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ సినిమా ఓ విజువల్ వండర్ కావటంతో పాటు.., భారత సినిమా ఇండస్ర్టీలో చరిత్ర సృష్టిస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే సినిమాను కొనేసిన డిస్ర్టిబ్యూటర్లు విడుదల కోసం సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ మూడు పాత్రల్లో నటించాడు. అమీజాక్సన్ హీరోయిన్ గా నటించగా.., రెహ్మాన్ సంగీతం అందించాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i hindi trailer  pk movie release  aamir khan latest  

Other Articles