Nandamuri balakrishna latest movie first look december 6 trisha krishna radhika apte

balakrishna, balakrishna latest news, balakrishna latest movie, nandamuri balakrishna latest movie, director satya deva, balakrishna trisha movie, balakrishna trisha latest movie, trisha krishna latest news, radhika apte news

nandamuri balakrishna latest movie first look december 6 trisha krishna radhika apte

డిసెంబర్ 6న గర్జిస్తానంటున్న బాలయ్య

Posted: 11/28/2014 08:04 PM IST
Nandamuri balakrishna latest movie first look december 6 trisha krishna radhika apte

‘లెజెండ్’ సినిమా తర్వాత బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలయ్య స్టయిల్’లోనే యాక్షన్ ఎంటర్’టైనర్’గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సత్యాదేవా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో బాలయ్యం చాలా పవర్’ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు మాట్లాడుతూ.. ‘లెజెండ్’ను మించిన స్థాయిలో ఈ సినిమా హిట్టవుతుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతా బాగానే వుందికానీ.. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ఏంటో ఇంకా వెలువడలేదు.

గతంలో ఈ సినిమాకు సంబంధించి ‘‘లయన్’’, ఇంకా కొన్ని టైటిళ్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే... ప్రస్తుతం అందుతున్న సమాచారాల ప్రకారం డిసెంబర్ 6వ తేదీన టైటిల్’తోబాటు ఫస్ట్ లుక్’ని కూడా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలొస్తున్నాయి. దీంతో ఈ మూవీ ఫస్ట్’లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదివరకే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్, సెల్ఫీస్ విడుదలయ్యాయి.

మరోవైపు చాలాకాలం తర్వాత తెలుగులో అవకాశమొచ్చినందుకు త్రిష ఆనందాన్ని వ్యక్తం చేయడంతోబాటు ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలాగే ‘లెజెండ్’లాంటి భారీ చిత్రంలో నటించిన రాధిక ఆప్టేకు ఆ చిత్రం తర్వాత మరే ఆఫర్లు రాకపోవడంతో ఈ చిత్రంపై ఆశలు పెట్టుకుంది. మరి బాలకృష్ణ వీరిద్దరి కెరీర్’లో వెలుగులు నింపుతారో లేదో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandamuri balakrishna  trisha krishnan  radhika apte  director satya deva  telugu news  

Other Articles