Mahesh babu latest tollywood records twitter followers cine career telugu film industry

mahesh babu, mahesh babu twitter, mahesh babu latest news, mahesh babu twitter records, mahesh babu fan followers, mahesh babu film career, mahesh babu tollywood

mahesh babu latest tollywood records twitter followers cine career telugu film industry

టాలీవుడ్’లోనే మహేష్ సరికొత్త రికార్డులు

Posted: 11/28/2014 07:39 PM IST
Mahesh babu latest tollywood records twitter followers cine career telugu film industry

రికార్డులను క్రియేట్ చేయాలన్నా, వాటిని తిరగరాయాలన్నా మహేష్’బాబుకు కొత్తకాదు. అది బాక్సాఫీస్ కలెక్షన్లలోగానీ, పారితోషికంలోగానీ, ప్రకటనలపరంగాగానీ.. ఇప్పటికే ఈ ప్రిన్స్ తన ఖాతాలో ఎన్నో రికార్డులు జమ చేసుకున్నాడు. కానీ ఇటీవలే విడుదలైన ‘‘ఆగడు’’ సినిమా భారీగా ఫ్లాప్ కావడంతో మహేష్ ఇమేజ్ కాస్త తగ్గిందని, ఆయనకు వ్యతిరేకంగా ప్రచారాలు జరుగుతున్నాయని ఈమధ్య వార్తలొచ్చాయి. అయితే ఇటువంటి వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తూ తాజాగా మహేష్ మరో రెండు రికార్డులను నమోదు చేసుకున్నాడు. ఇంతవరకు టాలీవుడ్’లో ఏ ఒక్క హీరో సాధించని ఘనత ఈ ప్రిన్స్ చేసి నిరూపించాడు.

తాజాగా మహేష్ ట్విటర్’లో మిలియన్ (పదిలక్షలు) ఫాలోవర్స్2ను సొంతం చేసుకుని మిలియన్ క్లబ్బులో చేరిపోయాడు. టాలీవుడ్’లో ఏ హీరోకు సోషల్ వెబ్’సైట్’లో ఇంతమంది ఫాలోవర్లు లేరు. ఇక రెండో రికార్డు విషయానికొస్తే.. చిన్నప్పుడే బాలనటుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్.. ఇప్పటికి 35 సంవత్సరాల సినీజీవితాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడున్న టాప్ హీరోలలో ఎవరికీ ఇంతటి లాంగ్ కెరీర్ లేదు. దీంతో పరిశ్రమలో ఎక్కువకాలం కొనసాగిన హీరోగా మహేష్ మరో సంచలనం సృష్టించాడు. ఇలా ఈవిధంగా ఒకేసారి రెండు రికార్డులతో మహేష్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  twitter followers  tollywood film industry  mahesh cine career  telugu news  

Other Articles