Nandini reddy movie with naga shourya

naga shourya next movie, naga shourya movie latest updates, naga shourya in nandini reddy movie, naga shourya latest news updates, naga shourya latest photos, nandini reddy next movie name, nandini reddy tollywood movies updates, latest telugu movies updates

nandini reddy movie with naga shourya : latest tollywood hero naga shourya will work with director nandini reddy soon, film nagar rumors that tollywood lady director nandini reddy to make a movie with naga shourya

నాగ్ తో నందిని సినిమా.. త్వరలో !

Posted: 11/26/2014 10:36 AM IST
Nandini reddy movie with naga shourya

తొలి సినిమా ‘అలా మొదలైంది’తోనే హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన లేడి డైరెక్టర్ నందిని రెడ్డి.., ఆ తర్వాత మాత్రం ఫ్లాపును మూటగట్టుకుంది. ‘జబర్దస్త్’ పేరుతో వచ్చిన సినిమా పెద్ద ఫ్లాపు ఇచ్చింది. ఆ తర్ావత ఇప్పటివరకు నందిని సినిమాలు రాలేదు. ఈ రెండు సంవత్సరాల పాటు కసితో కొత్త సినిమాకు కథ సిద్దం చేసుకుందట. ప్రతిసారి ఫెయిల్యూర్ ను గుర్తు చేసుకుంటూ కష్టపడి లోపాలు లేకుండ కధ రాసుకుందని అంటన్నారు.

తాజాగా వస్తున్న ఫిలింనగర్ సమాచారం ప్రకారం.., త్వరలోనే నందినిరెడ్డి కొత్త సినిమా చేయనుందని తెలుస్తోంది. యువ హీరో నాగ శౌర్యను ఈ మూవీలో హీరోగా ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలుస్తోంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’ వరుస హిట్ సినిమాలతో ఇండస్ర్టిలో కొనసాగుతున్న యంగ్ హీరోకు ఇది మంచి ఆఫర్ అని చెప్పాలి. నందిని రెడ్డి సినిమా హిట్ అయితే నాగ శౌర్య క్రేజ్ మరింత పెరుగుతుంది. ఒకవేళ కాకపోయినా.., శౌర్యకు సినిమా చాన్స్ వచ్చినట్లుగా చెప్పుకోవటానికి ఉంటుంది.

ప్రస్తుతం రెండు సినిమాలకు సైన్ చేసి కాస్త బిజీగా ఉన్న నాగ శౌర్య నందిని సినిమాపై ఇంకా ఫుల్ క్లారిటి ఇవ్వలేదు. బహుశా త్వరలోనే ఓకే చెప్తాడని అంటున్నారు. మరి ఈ సినిమా ఓకే అయితే గనక తమను తాము నిరూపించుకునేందుకు లభించిన ఒకే అవకాశంగా చెప్పవచ్చు. ‘అలా మొదలైంది’కి నందినిని నమ్మి డబ్బులు పెట్టిన ఎల్. దామోదర ప్రసాద్ నందిని తాజా ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandini reddy  tollywood  naga shourya  latest news  

Other Articles