Dil raju apoligised on pawan kalyan wrong phone number

dil raju on pawan kalyan mobile number, pawan kalyan phone number, dil raju apology on pawan number, dil raju next movie, dil raju produced movies, pawan kalyan mobile number contact address, pawan kalyan next movie, tollywood latest updates

dil raju apoligised on pawan kalyan wrong phone number : producer cum distributor dil raju finally clarified and given apalogy statement to pawan kalyan fans for giving wrong mobile number of pawan kalyan

తప్పడు పనికి తిప్పలు తప్పవని తెలిసింది

Posted: 11/25/2014 05:40 PM IST
Dil raju apoligised on pawan kalyan wrong phone number


పవన్ కళ్యాణ్ ఫోన్ నంబర్ వివాదంపై దిల్ రాజు ఎట్టకేలకు వివరణ ఇచ్చాడు. తాను ఇచ్చిన ఫోన్ నంబర్ సరైనది కాదు అని ప్రకటన విడుదల చేశాడు. పొరపాటున తప్పు నంబర్ ఇవ్వటం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నట్లుగా దిల్ రాజు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అసలు వివాదం చూస్తే.., ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సక్సెస్ మీట్ వైజాగ్ లో జరిగింది. ఈ మీట్ లో పాల్గొన్న దిల్ రాజును పవన్ నంబర్ ఇవ్వాలని ఫ్యాన్స్ పట్టుబట్టారు. దీంతో దిల్ రాజు ఓ నంబర్ ఇచ్చాడు. వెంటనే అందరూ నంబర్ ఫీడ్ చేసుకున్నారు.

ఇక అప్పటినుంచి ఆ నంబర్ కు డయల్ చేయటం మొదలు పెట్టారు. అవతలి వైపు వేరే వ్యక్తి విపరీతమైన కాల్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు. పవన్ నంబర్ ఇది కాదు అని చెప్తున్నా రిపీటెడ్ గా ఫోన్ చేస్తూ విసిగిస్తున్నారు. ఈ విషయం దిల్ రాజు సన్నిహితులకు తెలియటంతో, ఆయన కార్యాలయం స్పందించింది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సక్సెస్ మీట్ సందర్బంగా దిల్ రాజు ఇచ్చిన ఫోన్ నంబర్ సరైనది కాదు అని వివరణ ఇచ్చారు.

అభిమానుల ఒత్తిడి భరించలేక ఆయన ఎక్కవగా వాడని పాత నంబర్ ఇచ్చారని అయితే అభిమానులు విపరీతంగా కాల్స్ చేయటం వల్ల విషయంతో సంబంధం లేని అవతలి వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డాడని వివరణ ఇచ్చుకుంది. తప్పుడు నంబర్ ఇచ్చినందుకు పవన్ ఫ్యాన్స్ తో పాటు ఇబ్బంది కల్గించినందుకు ఫోన్ నంబర్ కలిగి ఉన్న వ్యక్తిని కూడా క్షమించాలని కోరటం జరిగింది. ఇకపై ఎవరూ ఆ నంబర్ కు ఫోన్ చేయవద్దని దిల్ రాజు కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dil raju  pawan kalyan  phone number  movie news  

Other Articles