Nara rohith next movie name revealed

nara rohith next movie name, nara rohith latest movie updates, nara rohith rowdy fellow review and collections, nara rohith pandagala vachaadu movie, pandagala vachadu cast and crew, shankara movie updates, tollywood latest movie news updates

nara rohith next movie name revealed : nara rohith next movie name is pandagala vachaadu and this project shooting work will complete soon in the year ending pandagala vachaadu will release

గ్యాపు లేకుండా దింపుతున్నాడు

Posted: 11/25/2014 02:02 PM IST
Nara rohith next movie name revealed

కొందరు హీరోలు సినిమాకు మరో సినిమాకు మద్య ఏడాది గ్యాప్ తీసుకుంటుంటే.., నారా రోహిత్ మాత్రం వరుసగా గ్యాపు లేకుండా సినిమాలు దించేస్తున్నాడు. తాజా సినిమా ‘రౌడి ఫెల్లో’హిట్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో నడుస్తుండగా.., కొత్తగా మరో సినిమ విడుదల కోసం సిద్దమవుతోంది. సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం.., నారా రోహిత్ ‘పండగలా వచ్చాడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా అప్పుడే  పూర్తికావచ్చిందని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందట.

‘పండగలా దిగివచ్చాడు’ సినిమాలో ‘యాక్షన్ 3డి’ నీలం ఉపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో కార్తికేయ ప్రసాద్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కమర్షియల్ యాంగిల్స్ కలిసిన మూవీగా ‘పండగలా వచ్చాడు’ ఉంటుందని మూవీ యూనిట్ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ మూవీ వివరాలు వెల్లడిస్తామని వారు చెప్పారు. ఇక రోహిత్ హీరోగా ‘శంకర’ అనే సినిమా కూడా విడుదల కోసం సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి డిసెంబర్ చివర్లో విడుదల  అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara rohith  pandagala vachadu  shankara  tollywood  

Other Articles